మెగాస్టార్ సైరా నరసింహా రెడ్డి టీజర్

Sye Raa Narasimha Reddy

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `సైరా`. రామ్‌చ‌ర‌ణ్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప‌లు కీల‌క‌పాత్ర‌ల్లో వివిధ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప్రముఖ న‌టులు క‌నిపించ‌నున్నారు. వచ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల కానున్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ చిత్ర టీజర్‌ను రేపు(బుధవారం) చిరు బర్త్ డే సందర్భంగా ఒకరోజు ముందే అంటే ఈరోజు ఉదయం 11:30 గంటలకు రిలీజ్ చేసింది చిత్రబృందం. సైరా చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్‌  ప్రసాద్ ల్యాబ్స్‌లో జరుగుతోంది. టీజర్ ను మీరూ ఒక లుక్ వేసెయ్యండి మరి