కేర‌ళ వరదల మీద కేంద్రం కీలక ప్రకటన…!

Central Govt Declares Kerala Floods As Severe Natural Camity

దేవుడి సొంత దేశంగా పిలవబడే కేరళ ప్రకృతి వైపరీత్యానికి అల్లల్లాడింది. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైంది. ఇప్పుడిప్పుడే వ‌ర్షాలు కాస్త తెర‌పినిస్తుండ‌టంతో ఇప్పుడిప్పుడే చాలా మంది పున‌రావాసాల నుంచి సొంత ఇళ్ల‌కు వెళ్లి ఆ ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు. కొంతమంది ఇళ్ళు వరదలలో కొట్టుకుపోవడంతో వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో మిగిలిపోయారు. దీంతో కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది.

kerala-foods

అన్ని రాష్ట్రాల సీఎంలు ఇదే డిమాండ్ ను కేంద్రం ముందు ఉంచగా ఎట్ట‌కేల‌కు కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ కేర‌ళ వ‌ర‌ద‌ల‌ను తీవ్ర‌మైన విప‌త్తుగా ప్ర‌క‌టించింది. దీని వ‌ల్ల కేర‌ళ‌కు జాతీయ విప‌త్తు నిధి నుంచి సాయం అందుతుంది. ఆగ‌స్టు 18న కేంద్ర బృందం కేర‌ళ రాష్ట్రంలో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించింది. న‌ష్టాన్ని అంచ‌నా వేసిన హోం శాఖ కేర‌ళ వ‌ర‌ద‌ల‌ను తీవ్ర‌మైన విప‌త్తుగా ప్ర‌క‌టించింది. కేరళ వరదలలో ఇప్ప‌టివ‌ర‌కూ ఏడు లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్రం దీనిని తీవ్రమైన పకృతి విపత్తుగా గుర్తిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది.

KERALA-FOODS-RAINS