కర్ణాటక వరదల్లో 4 వేల మంది గల్లంతు !

4 thousand members missing in kodagu floods

కేరళలో బీభత్సం సృష్టించిన భారీ వర్షాలు, వరదలు కేరళ కర్ణాటక సరిహద్దులోని కొడగు జిల్లాను కూడా అతలాకుతలం చేశాయి. నిన్న కర్ణాటక సీఎం కూడా వెళ్లి ఏరియల్ సర్వే చేసి వచ్చారు. అయితే ఆ జిల్లాలో గల్లంతయిన వారి సంఖ్య ఇప్పుడు భయానికి గురిచేస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం జల ప్రళయానికి కొడగు జిల్లాలో 4 వేల మందికి పైగా గల్లంతయ్యారనే వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. మరో 50 వేల మందికి పైగా వరదల్లో చిక్కుకున్నారని గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.

4 thousand members

పంటపొలాలు, తోటలు, కొండగుట్టలు, రిసార్టులు, స్టే హోంలు నిర్వహిస్తూ వేలాది మంది కొడగు జిల్లాలో నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది ఆచూకీ లభించడం లేదని తెలుస్తోంది. మడికేరిలో 18, విరాజ్ పేటలో 7, సోమవారపేటలో 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం 5,818 మందికి ఆశ్రయం కల్పించారు. అలాగే జిల్లాలోని మక్లూడు గ్రామంలో నీటిలో చిక్కుకుపోయిన 60 మంది సినీ నటి హర్షికా పూనాంచా బంధువులని సైన్యం గుర్తించింది. వారందరినీ సురక్షిత ప్రాంతాలకి చేరుస్తున్నారు.

  kodagu floods