దేవెగౌడ కుమారులు…పరువు తీస్తున్నారు !

kumaraswamy-reading-news-paper-in-aerial-survey-video-goes-viral

మాజీ ప్రధాని దేవెగౌడ కుమారులు ఇద్దరు ఇప్పుడు ఒకేసారి వార్తల్లోకి ఎక్కారు. అదీ అదేదో ఘన కార్యం చేసి కాదు ఒరజలు ఛీ కొట్టే పనులు చేసి. దేవే గౌడ కుమారులలో కుమారస్వామి ఇప్పుడు కర్ణాటాక సీఎంగా మరో కుమారుడు రేవణ్ణ కర్నాటకకు మంత్రిగా పంచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేరలతో పాటు సరిహద్దులోని కర్నాటక జిల్లాలను కూడా వరద ముంచెత్తిన సమయంలో ప్రజలకి ధైర్యం చెప్పి అండగా నిలవాల్సిన వారు చేసిన పని ఇప్పుడు కర్నాటక మొత్తం వారిని చీదరించుకుంతోంది. ఇంతకీ వారు చేసిన ఘన కార్యాలు ఏమిటంటే ముందుగా కుమార స్వామి విషయానికి వస్తే కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కొన్ని జిల్లాలను వరదల పాలు చేశాయి. ఈ నష్టాన్ని చూసేందుకు ఏరియల్ సర్వేకు బయల్దేరిన ముఖ్యమంత్రి కుమార స్వామి.

kumaraswamy

హెలికాప్టర్ ఎక్కాక కనీసం ఆ హెలికాప్టర్ కిటికీ నుండి బయటకు కూడా చూడకుండా పేపర్ చదువుకుంటూ కూర్చున్నారు. అ హెలికాప్టర్ లో ఉన్న ఎవరో ఆ తతంగాన్ని అంతా తీసి సోషల్ మీడియాకి ఎక్కించాడు. దెబ్బకి సీఎం చెవులకి పట్టిన తుప్పు వదిలే రేంజ్ లో ఆయన మీద ట్రోలింగ్ మొదలయ్యింది. ఇక ఆయన సోదరుడు దేవెగౌడ మరో కుమారుడు కర్ణాటక మంత్రి రేవణ్ణ ఇంకాస్త కండకావరం వచ్చిన పని చేస్తూ వీడియోలో మీడియాకి దొరికేసారు. పునరావస కేంద్రాలలో ఉన్న బాదితులకి బిస్కట్లు, ఆహార పదార్ధాలు వరద బాధితులకు కుక్కలకు విసిరినట్లు విసురుతూ వీడియోలో బుక్ అయ్యారు. తన కోపమే తన శత్రువు అని తెలుగులో సామెత ఉనట్టు మన బలుపే మన శత్రువు అనుకోవాలేమో ?