కొత్త రికార్డును సృష్టించిన నయనతార

కొత్త రికార్డును సృష్టించిన నయనతార
Latest News

నయనతార తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ సోషల్‌ మీడియాకు దూరంగా నయనతార.. తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో ఎంట్రీ ఇచ్చింది. జైలర్‌లోని హుకుమ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో.. తన ఇద్దరు పిల్లలను ఎత్తుకుని మాస్‌ లెవల్లో ఎంట్రీ ఇస్తున్న వీడియోను పోస్ట్‌ చేసింది. అలా ఎంట్రీ ఇచ్చిందో లేదొ అప్పుడే లక్ష ఫాలోవర్స్ వచ్చేసారు . అభిమానులకు మరింత చేరువయ్యేందుకు నయన్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి వచ్చింది.

video : LInk 

కొత్త రికార్డును సృష్టించిన నయనతార
Nayanatara

అయితే.. ఈ తరుణంలోనే… లేడీ సూపర్ స్టార్ నయనతార ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అత్యంత వేగంగా 1 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను చేరుకున్న ఇండియన్ నటిగా రికార్డు సృష్టించారు. ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన 10 గంటల్లోనే ఆమెకి 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. గతంలో కత్రినాకైఫ్ కు 24 గంటల్లో 1 మిలియన్ ఫాలోవర్స్ రాగా, ఆ రికార్డును నయనతార బ్రేక్ చేసారంట . ప్రస్తుతం నయనతారకు ఇన్ స్టాగ్రామ్ లో 1.2 మిలియన్ మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఆమె పోస్ట్ చేసిన తొలి వీడియోకు 1 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి.