విజయ్ దేవరకొండ: 21 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో సోషల్ మీడియా కింగ్!

విజయ్ దేవరకొండ: 21 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో సోషల్ మీడియా కింగ్!
Cinema News

టాలీవుడ్ యంగ్ స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండ తాజాగా పరశురామ్ పెట్లతో చేస్తున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5 న గ్రాండ్ గా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఫ్యామిలీ స్టార్ పై అందరిలో మంచి అంచనాలు కూడా ఉన్నాయి.

ఇక ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా సినీ, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్, ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు విజయ్ దేవరకొండ. మ్యాటర్ ఏమిటంటే, తాజాగా విజయ్ ఇన్స్టాగ్రామ్ లో 21 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తరువాత ఇంత భారీ స్థాయిలో ఫాలోవర్స్ అందుకున్న రెండవ టాలీవుడ్ హీరోగా విజయ్ దేవరకొండ నిలిచారు.