ఓటిటి ఇంగ్లీష్ భాష లో అందుబాటులో కి వచ్చేసిన “సలార్ ” ….!

ఓటిటి ఇంగ్లీష్ భాష లో అందుబాటులో కి వచ్చేసిన
Cinema News

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి సక్సెస్ టాక్ తో మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.

ఓటిటి ఇంగ్లీష్ భాష లో అందుబాటులో కి వచ్చేసిన  "సలార్ " ....!
Salaar Movie

కాగా ఈ పాన్ ఇండియన్ సినిమా థియేటర్ రిలీజ్ అనంతరం కొన్నాళ్ల క్రితం ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఐదు భాషల్లో పాన్ ఇండియన్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, తాజాగా సలార్ సినిమా యొక్క ఇంగ్లీష్ వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చినట్లు నెట్ ఫ్లిక్స్ వారు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈశ్వరి రావు, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఝాన్సీ, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ సినిమా కి రవి బస్రూర్ సంగీతం అందించారు.