ర‌మ‌ణానంద‌మ‌హ‌ర్షిపై క‌రాటేక‌ళ్యాణి ఫిర్యాదు

Actress karate kalyani Case Against Ramanananda Maharshi
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సినీ న‌టి క‌రాటే క‌ళ్యాణి ర‌మ‌ణానంద‌మ‌హ‌ర్షిపై పోలీసుల‌కు ఫిర్యాదుచేసింది. ర‌మ‌ణానంద కు చెందిన ఓ భ‌క్తి చాన‌ల్ లో త‌న‌ను కించ‌ప‌రిచేలా క‌థ‌నాలు ప్ర‌సారం చేశార‌ని ఆమె ఆరోపించింది. త‌న ప‌రువుకు భంగం క‌లిగిస్తున్న ర‌మ‌ణానంద మ‌హ‌ర్షిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కోరింది. హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా ర‌మ‌ణానంద ఇస్తున్న ప్ర‌సంగాల‌ను వ్య‌తిరేకిస్తున్నంద‌నే త‌న‌పై అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తంచేసింది. హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ కోసం తాను ఎంత‌గానో కృషిచేస్తున్నాన‌ని, దేవుళ్ల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న ర‌మ‌ణానంద‌ను ప్ర‌శ్నించే హ‌క్కు త‌న‌కుంద‌ని క‌రాటే క‌ళ్యాణి వ్యాఖ్యానించింది. తాను చేసిన విమ‌ర్శ‌ల‌కు బ‌దులివ్వ‌కుండా త‌న‌పై వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేయ‌డంపై ఆమె మండిప‌డింది.