ప్రభాస్ పెళ్ళికి ముహూర్తం పెట్టిన జ్యోతిష్కుడు.

Naganath says About Prabhas Marriage Astrology
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాహుబలి ప్రభాస్ ఎప్పుడు పెళ్లిపీటలు ఎక్కుతాడా అని ఆయన అభిమానులే కాదు కుటుంబ సభ్యులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ ఇంకా ఊ అనలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని అప్పట్లో జోరుగా పుకార్లు వచ్చాయి. బాహుబలి మాత్రమే కాదు బాహుబలి 2 కూడా వచ్చివెళ్ళింది. కానీ ప్రభాస్ పెళ్లిమాట ఎత్తలేదు. సాహో మొదలైంది. మళ్లీ ప్రభాస్ పెళ్లి ఎప్పుడన్న పాత ప్రశ్న సమాధానం దొరక్క ఎదురు చూస్తోంది.

ఈ ప్రశ్నకు ప్రభాస్ ఎటూ సమాధానం చెప్పడం లేదు కదా అని టీవీ ఛానెల్స్ లో ప్రముఖుల భవిష్యత్ ,వారి వ్యక్తిత్వాల గురించి చెప్పే ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాధ్ ఓ ముహూర్తంతో ముందుకు వచ్చాడు. ప్రభాస్ జాతకం ప్రకారం ఈ ఏడాది మార్చి నుంచి ఏప్రిల్ మధ్య వివాహ ఘడియలు వున్నాయట. అయితే ఎన్నో ఊహాగానాలు వచ్చినట్టు ప్రభాస్ ప్రేమపెళ్లి చేసుకునే ఛాన్స్ లేదట. పెద్దలు కుదిర్చిన పెళ్లి మాత్రమే చేసుకుంటారట. ఇక ప్రభాస్ జాతకరీత్యా పెళ్లికూతురు మామ గారింటికి తూర్పు ఈశాన్యం నుంచి వస్తుందని నాగనాధ్ అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ కి నమస్తే అనే తెలుగు యు ట్యూబ్ ఛానల్ వేదిక అయ్యింది.