చిరు సినిమాను నాని రీమేక్‌ చేస్తే..!

nani wants remake chiru chantabbai movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో నిన్నటి తరం హీరోల్లో కష్టపడి పైకి వచ్చిన హీరో చిరంజీవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పటి తరం యువ హీరోల్లో నాని స్వశక్తితో స్టార్‌గా ఎదిగిన విషయం తెల్సిందే. క్లాప్‌బాయ్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నాని ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను క్రియేట్‌ చేసుకున్నాడు. అందుకే చిరంజీవికి, నానికి చాలా పోలికలు ఉన్నాయి అంటూ సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూ ఉంటుంది. నటన పరంగా కూడా నాని ఏ పాత్ర ఇచ్చినా కూడా చేయగల సత్తా ఉన్న నటుడు. అందుకే చిరంజీవి సూపర్‌ హిట్‌ చిత్రం అయిన ‘చంటబ్బాయి’ని రీమేక్‌ చేయాలని కొందరు కోరుకుంటున్నారు.

చిరంజీవి, సుహాసిని జంటగా జంద్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చంటబ్బాయి చిత్రంలో మెగాస్టార్‌ ఒక కామెడీ డిటెక్టివ్‌గా నటించాడు. అద్బుతమైన నటనతో చిరు ఆకట్టుకున్నాడు. ఆ స్థాయి నటనతో ఆ పాత్రను రక్తి కట్టించగల సత్తా కేవలం నానికి మాత్రమే ఉందని, ఆయనతో రీమేక్‌ చేస్తే సినిమా మళ్లీ సూపర్‌ హిట్‌ ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే నానితో ‘చంటబ్బాయి’ చిత్రం రీమేక్‌ విషయమై చర్చలు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. నాని ఛాలెంజింగ్‌ పాత్రలను చేసేందుకు ఎప్పుడు ముందు ఉంటాడు. అలాగే ఈ చిత్రాన్ని చేసేందుకు కూడా తప్పకుండా ఒప్పుకుంటాడు అనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.