జూలీ 2 న‌గ్మా బ‌యోపిక్?

actress Nagma response to lakshmi rai Julie-2 being based on her life

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

దక్షిణాది న‌టి రాయ్ ల‌క్ష్మీ బాలీవుడ్ డెబ్యూ మూవీగా మాత్ర‌మే జూలీ 2 సినిమా ఇప్ప‌టిదాకా వార్త‌ల్లో నిలిచింది. జూలీ 2 హీరోయిన్ గా ఇప్ప‌టికే ఆమెను బాలీవుడ్ గుర్తించింది. అయితే ఇప్పుడు జూలీ 2 గురించి మ‌రో ఆస‌క్తి క‌ర క‌థ‌నం వినిపిస్తోంది. జూలీ 2 ఒక‌ప్ప‌టి దక్షిణాది అగ్ర‌న‌టి న‌గ్మా జీవిత‌క‌థ‌ని, రాయ్ లక్ష్మీ ఆమె పాత్ర‌లో న‌టించింద‌ని వార్త‌లొస్తున్నాయి. చిత్ర యూనిట్ నేరుగా ఈ విష‌యాన్ని నిర్దారించ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఇన్ డైరెక్ట్ గా హింట్స్ ఇస్తున్నారు. 1990, 2000 మధ్య కాలంలో తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల‌ను ఒక ఊపు ఊపిన ద‌క్షిణాది హీరోయిన్ కు సంబంధించిన క‌థే జూలీ 2 అని సినిమాకు సంబంధించిన కీల‌క వ్య‌క్తులు వెల్ల‌డించారు. దీనితో పాటు అనేక క్లూలు ఇస్తోంది చిత్ర యూనిట్. ఖాన్ ల్లో ఒక‌రితో ఆమె తొలి సినిమా చేసింద‌ని, ఆ త‌ర్వాత ద‌క్షిణాదికి వెళ్లి తెలుగు, త‌మిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా ఎదిగింద‌ని తెలిపారు. ఓ త‌మిళ స్టార్ తో న‌డిపిన ఎఫైర్ తో ఆమె కెరీర్ ముగిసింద‌ని, ఆ త‌ర్వాత ఆమె ద‌క్షిణాది నుంచి భోజ్ పురికి వెళ్లింద‌ని చెప్పారు. ఈ సినిమా క‌చ్చితంగా ఒక మాజీ హీరోయిన్ క‌థ‌తో తీసిన సినిమానే అని నిర్మాత‌, సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ మాజీ చైర్మ‌న్ ప‌హ్లాజ్ నిహ్లాని వెల్ల‌డించారు.

nagma

ఈ సినిమాను ఆయ‌న డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. జూలీ 2 ను ఎవ‌రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కించామో తాము చెప్ప‌ద‌లుచుకోలేద‌ని, ఎందుకంటే ఆమె పేరు బ‌య‌టికి వ‌స్తే సినిమా ఆగిపోయే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. జూలీ 2లో న‌టించిన ఇద్ద‌రు కీల‌క న‌టుల్లో ఒక‌రితో ఆ మాజీ హీరోయిన్ కు గ‌తంలో సంబంధం ఉండేద‌ని తెలిపారు. సినిమా చూస్తే ఆ న‌టి ఎవ‌రో అంద‌రికీ అర్ధ‌మైపోతుంద‌న్నారు. చిత్ర‌యూనిట్ చెప్పిన వివ‌రాలు చూస్తే ఆ న‌టి న‌గ్మా అన్న‌ది స్పష్ట‌మ‌వుతోంద‌ని సినీ విశ్లేష‌కులు అంటున్నారు. తొలిసినిమా బాఘీలో స‌ల్మాన్ ఖాన్ తో న‌టించిన న‌గ్మా త‌ర్వాత దక్షిణాదికి వ‌చ్చి తెలుగు, త‌మిళ భాష‌ల్లో అగ్ర న‌టుల సినిమాల్లో న‌టించింది. నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. త‌మిళ హీరో శ‌ర‌త్ కుమార్ తో ఆమెకు ఎఫైర్ ఉంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన సంగ‌తే.

nagma-and-rai-lakshmi

న‌గ్మాతో సంబంధం కార‌ణంగా శ‌ర‌త్ కుమార్ వైవాహిక జీవితంలో మ‌న‌స్ఫ‌ర్ధ‌లు వ‌చ్చాయ‌ని కూడా చెప్పుకుంటారు. త‌ర్వాత శ‌ర‌త్ కుమార్ దూరంగా జ‌ర‌గ‌డంతో ఆమె డిప్రెష‌న్ కు గుర‌యింద‌ని, ఆ క్ర‌మంలోనే ఆమె కెరీర్ ముగిసిపోయింద‌ని ద‌క్షిణాదిన ఓ టాక్ ఉంది. త‌ర్వాతి రోజుల్లో తెలుగు, త‌మిళ అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో న‌గ్మ భోజ్ పురి ప‌రిశ్ర‌మ‌కు వెళ్లి అక్క‌డ టాప్ హీరోయిన్ అయింది. ఆ స‌మ‌యంలోనే ఆమె భోజ్ పురి హీరో రవికిష‌న్ తో స‌న్నిహితంగా మెలిగింద‌న్న పుకార్లు వ‌చ్చాయి. ర‌వికిష‌న్ ప్ర‌స్తుతం జూలీ 2 సినిమాలో కీల‌క పాత్ర పోషించారు. ఇలా జూలీ 2 చిత్ర యూనిట్ చెప్పిన క్లూల‌న్నీ న‌గ్మాకు స‌రిగ్గా స‌రిపోతున్నాయి. అందుకే ఇది న‌గ్మా జీవిత క‌థ అన్న ప్ర‌చారం జ‌రుగుతోంది. చిత్ర యూనిట్ ఇచ్చిన క్లూ లే కాకుండా…న‌గ్మా జీవితంలో మ‌రికొన్ని ముఖ్య‌మైన సంఘ‌ట‌న‌లూ ఉన్నాయి.

nagma-and-railakshmi

శ‌ర‌త్ కుమార్ తో ప్రేమ విఫ‌ల‌మైన త‌ర్వాత‌..న‌గ్మా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీకి ద‌గ్గ‌ర‌యింది. గంగూలీ కెప్టెన్ గా ఉన్న స‌మ‌యంలోనే న‌గ్మాతో ప్రేమాయ‌ణం న‌డిపాడు. వారిద్ద‌రూ క‌లిసి స‌ర్ప‌దోష నివార‌ణ పూజ‌కు శ్రీకాళ‌హ‌స్తి వ‌చ్చి మీడియా కంటికి చిక్క‌డం అప్ప‌ట్లో తీవ్ర వివాదంగా మారింది. అలాగే ….సినిమాల‌కు గుడ్ బై చెప్పిన త‌ర్వాత న‌గ్మా కాంగ్రెస్ లో చేరి ఎంపీ అయ్యారు. ఈ సంగ‌తుల‌ను సినిమాలో ప్ర‌స్తావించారా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది. అటు ఈ వార్త‌ల‌పై న‌గ్మా స్పందించింది. ఈ వార్త‌లను తాను తొలిసారిగా వింటున్నాన‌ని చెప్పింది. ప‌ద్మావ‌తి సినిమా మాత్ర‌మే వార్త‌ల్లో ఉండ‌డంతో ప‌బ్లిసిటీ కోసం జూలీ 2 నిర్మాత‌లు ఇలాంటి హింట్స్ ఇచ్చి ఉంటార‌ని న‌గ్మా అభిప్రాయ‌ప‌డింది.

rai-lakshmi-and-nagma