‘మెంటల్‌ మదిలో’ ప్రివ్యూ

Mental Madilo Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :  శ్రీవిష్ణు, నివేత 

నిర్మాత:   రాజ్ కందుకూరి
దర్శకత్వం :  వివేక్ ఆత్రేయ 

మ్యూజిక్ : ప్రశాంత్  ఆర్  విహారి 

గత సంవత్సరం ఒక చిన్న చిత్రంగా విడుదలైన ‘పెళ్లి చూపులు’ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. చిన్న చిత్రాల్లో ‘బాహుబలి’ వంటి సినిమా అంటూ ‘పెళ్లి చూపులు’పై విమర్శకుల ప్రశంసలు కురిపించారు. ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత రాజ్‌ కందుకూరి తాజాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్‌బాబు సమర్పించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగి పోయాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. ‘పెళ్లి చూపులు’ తరహాలోనే ఈ సినిమా కూడా చాలా విభిన్నంగా, యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లా ఉంటుందని ప్రేక్షకులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా క్లాస్‌ ఏ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ మరియు టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. చిన్న సినిమా అయినా కూడా చాలా ఎక్కువగా పబ్లిసిటీ చేశారు, చేస్తూనే ఉన్నారు. పోటీ లేని సమయంలో విడుదల చేయాలని ఇన్నాళ్లు వాయిదాలు వేస్తూ వచ్చిన ఈ చిత్రం రేపు విడుదలకాబోతున్న 11 చిత్రాల్లో ఒక్క చిత్రంగా రాబోతుంది. ఇతర చిత్రాల కంటే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే అన్ని ఏరియాల్లో కూడా మంచి బిజినెస్‌ను చేసింది. ఖచ్చితంగా ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకునేలా, విభిన్నంగా ఉంటుందని సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.