‘బాలకృష్ణుడు’ ప్రివ్యూ…

Balakrishnudu Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :    నారా రోహిత్, రేజీనా, రమ్య కృష్ణ , వెన్నెల  కిషోర్ 

నిర్మాతలు:  మహేంద్ర బాబు , ముసునూరు  వంశీ, శ్రీ వినోద్ నందమూరి
దర్శకత్వం : పవన్ మల్లెల 

సినిమాటోగ్రఫీ:  విజయ్ సి. కుమార్
ఎడిటర్ :  కోటగిరి వెంకటేశ్వరరావు
మ్యూజిక్ : మణిశర్మ 

నారా హీరో రోహిత్‌ వరుసగా ఫ్లాప్‌లు వస్తున్నా కూడా పట్టించుకోకుండా తన వంతు బాధ్యత అన్నట్లుగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్‌ కోసం ప్రయత్నాలు చేస్తూ వెళ్తున్నాడు. తాజాగా నారా రోహిత్‌ నటించిన చిత్రం ‘బాలకృష్ణుడు’. ఈ చిత్రాన్ని సినిమా ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్న మహేందర్‌ ఈ చిత్రానికి నిర్మాత అవ్వడంతో మంచి పబ్లిసిటీ చేశాడు. ఆడియో విడుదలను సమంత చేతుల మీదుగా చేయడంతో పాటు, భారీ ఎత్తున కార్యక్రమాలు చేసి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లడంలో నిర్మాత సక్సెస్‌ అయ్యాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

పవన్‌ మల్లెల దర్శకత్వంలో నారా రోహిత్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో హాట్‌ బ్యూటీ రెజీనా హీరోయిన్‌గా నటించింది. గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రంలో నారా రోహిత్‌ చాలా విభిన్నంగా కనిపిస్తాడని ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు ట్రైలర్‌లను చూస్తుంటే అనిపిస్తుంది. ఈ చిత్రంలో నారా రోహిత్‌ మొదటి కమర్షియల్‌ సక్సెస్‌లను దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రను పోషించడం కూడా ఒక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. రమ్యకృష్ణ ‘బాహుబలి’ తర్వాత ఒక మంచి పవర్‌ ఫుల్‌ పాత్రను చేసిందని, ఈ చిత్రంలో ఆమె మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపనుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటే మరికొన్ని గంటలు వెయిట్‌ చేయాల్సిందే.