శర్వానంద్‌, హను రాఘవపూడిల చిత్రం ప్రారంభం

Sharvanand Hanu Raghavapudi new movie opening

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఈసంవత్సరం ‘శతమానం భవతి’, ‘మహానుభావుడు’ చిత్రంతో మంచి విజయాలను అందుకుని జోరుమీదున్న యువ హీరో శర్వానంద్‌ తన తర్వాత సినిమాను హను రాఘవపూడి దర్శకత్వంలో మొదలు పెట్టాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హను రాఘవపూడి ‘లై’ తర్వాత చేస్తున్న చిత్రం ఇది. ఒక మంచి యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రంను సుధాకర్‌ చెరుకూరి మరియు ప్రసాద్‌ చుక్కపల్లిలు నిర్మిస్తున్నారు.

,Sharwanand and Hanu Raghavapudi movie pooja ceremony

మొదటి షాట్‌కు దిల్‌రాజు క్లాప్‌ కొట్టగా సుకుమార్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ కొరియోగ్రఫర్‌ రాజు సుందరం కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. ఒక మంచి లవ్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని చేస్తున్నా, తప్పకుండా ప్రేక్షకులను అలరించడంతో పాటు, శర్వానంద్‌కు మంచి సినిమాగా నిలుస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు హను రాఘవపూడి చెప్పుకొచ్చాడు. నిర్మాత చెరుకూరి సుధాకర్‌ మాట్లాడుతూ.. శర్వానంద్‌తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. హను మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ఈ చిత్రాన్ని చాలా శ్రద్ద తీసుకుని చేస్తున్నాడు. కథ చెప్పినప్పుడు తప్పకుండా ఇది యూత్‌ను ఆకట్టుకునే సినిమా అవుతుందని భావించాను. మా బ్యానర్‌లో రాబోతున్న మొదటి సినిమా ఇది. ఈ చిత్రంతో మాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. త్వరలోనే సినిమా టెక్నీషియన్స్‌ను ఎంపిక చేసి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనున్నట్లుగా చెప్పుకొచ్చాడు.