ఆహా లోకి మగధీర డిజిటల్ రీ రిలీజ్ .. ఎప్పుడంటే…?

ఆహా లోకి మగధీర డిజిటల్ రీ రిలీజ్ .. ఎప్పుడంటే...?
Cinema News

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా మగధీర మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా ఆహా వీడియో లో రీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా ఆహా వీడియో లో నవంబర్ 3, 2023 నుండి డిజిటల్ ప్రీమియర్ గా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నది . ప్రీమియం క్వాలిటీ తో ఆడియెన్స్ ని అలరించడానికి రెడీ అవుతోంది.

ఆహా లోకి మగధీర డిజిటల్ రీ రిలీజ్ .. ఎప్పుడంటే...?
Maghadheera Movie

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బీవీఎస్ఎన్ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. శ్రీహరి, దేవ్ గిల్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.