భారీ స్థాయి ప్రమోషన్స్ ప్లానింగ్ లో ఉన్న ‘సలార్’ టీమ్ ?

భారీ స్థాయి ప్రమోషన్స్ ప్లానింగ్ లో ఉన్న ‘సలార్’ టీమ్ ?
Cinema News

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ సినిమా సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. ఈ సినిమా పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్న సంగతి మనకి తెలిసిందే. హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై విజయ్ కిరగందూర్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక సలార్ నుండి ఇప్పటికి కేవలం ఫస్ట్ లుక్ టీజర్ మాత్రమే బయటకు వచ్చింది. మరోవైపు ఈ సినిమా నుండి సాంగ్స్, ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగానే ఎదురు చూస్తున్నారు.

భారీ స్థాయి ప్రమోషన్స్ ప్లానింగ్ లో ఉన్న ‘సలార్’ టీమ్ ?
Prabhas ” Salaar movie “

కాగా వారికి అతి త్వరలో సలార్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్ ప్రకారం ప్రస్తుతం తమ సినిమా కోసం సలార్ టీమ్ గ్రాండ్ లెవెల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ ని వరుసగా ప్లాన్ చేస్తున్నారట. అలానే అన్ని ఈవెంట్స్ కి హీరో ప్రభాస్ హాజరయి ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపనున్నారని టాక్. ఇక సలార్ ట్రైలర్ ని నవంబర్ రెండవ వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని పై వారి నుండి అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది కాగా ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్ లో డిసెంబర్ 22న పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.