బుల్లి తెరను వీడి వెండి తెరను..!

sasha chettri be act sai-kiran adavi
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఒక సాదారణ మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సాహా చెట్రికి ఊహించని అవకాశంగా ఎయిర్‌టెల్‌ డేటా యాడ్‌లో అవకాశం వచ్చింది. సింపుల్‌గా ఉన్న అమ్మాయి ఎయిర్‌టెల్‌ డేటా గురించి చెబుతూ యూత్‌ దృష్టిని ఆకర్షించింది. ఎయిర్‌ డాటా యాడ్స్‌లో ఆమె నటించడం వల్ల ఎయిర్‌టెల్‌కు మంచి పబ్లిసిటీ దక్కింది. ఇక సాహా కూడా స్టార్‌ అయిపోయింది. ఎయిర్‌టెల్‌ మాత్రమే కాకుండా పలు కంపెనీలకు కూడా ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించింది. పొట్టి జుట్టుతో, బక్కపల్చగా ఉన్న ఈ అమ్మాయి బుల్లి తెరను ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు ఈమె వెండి తెరపై మెరిసేందుకు సిద్దం అవుతుంది.

ఈమెకు పలు చిత్రాల్లో అవకాశాలు వచ్చినా కూడా ప్రాముఖ్యత లేని పాత్రలు అవ్వడంతో వాటికి నో చెబుతూ వచ్చింది. ఎట్టకేలకు తెలుగులో సాహా ఒక చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు కమిట్‌ అయినట్లుగా తెలుస్తోంది. తెలుగులో సాయి కిరణ్‌ అడవి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఒక ప్రేమ కథ చిత్రంలో సాహా హీరోయిన్‌గా నటించబోతుంది.

దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న సాహాకు బాలీవుడ్‌లో ప్రయత్నిస్తే ఛాన్స్‌లు వస్తాయి. కాని ఆమె మాత్రం టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటించేందుకు ఫిక్స్‌ అయ్యింది. సౌత్‌లో సత్తా చాటి ఇక్కడ నుండి బాలీవుడ్‌కు వెళ్తుందేమో చూడాలి. వేసవిలో సాహా నటించబోతున్న తొలి తెలుగు సినిమా పట్టాలెక్కబోతుంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెళ్లడి చేస్తాను అంటూ దర్శకుడు సాయి కిరణ్‌ అడవి పేర్కొన్నాడు. బుల్లి తెరపై ఆకట్టుకున్న సాహా వెండి తెరపై ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.