బుల్లితెర భామకు ప్రభాస్‌ భారీ ఆఫర్‌…!

Sasha Chettri In Prabhas Saaho

ప్రస్తుతం వెండితెరతో పాటు బుల్లితెరపై కనిపిస్తున్న వారికి కూడా క్రేజ్‌ విపరీతంగా పెరిగిపోతుంది. బుల్లితెరపై కనిపిస్తున్న చాలామంది అతి తక్కువ సమయంలో వెండి తెరపై మెరిసి పోతున్నారు. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా చేస్తున్న మోడల్స్‌ కూడా మంచి ఆఫర్‌లను సొంతం చేసుకుంటున్నారు. ఒక ప్రముఖ టెలికాం సంస్థకు 4జీ నెట్‌వర్క్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ సాషా చెత్రీ యూత్‌లో యమ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అతి తక్కువ కాంలోనే ఈ అమ్మడు యూత్‌ను బాగా ఆకర్షించింది. దాంతో సాషాకు వరుస సినిమాల ఆఫర్లు వస్తున్నాయి. ఈ అమ్మడు ప్రస్తుతం అడవి సాయి కిరణ్‌ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం విడుదల కాకముందే ఈ 4జీ భామకు మరో భారీ ఆఫర్‌ వచ్చింది.

4-g-com

సుజీత్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ రేంజ్‌లో తెరకెక్కుతున్న ప్రభాస్‌ ‘సాహో’ చిత్రంలో సాషాకు క్రేజీ ఆఫర్‌ వచ్చింది. ఇందులో పలువురు బాలీవుడ్‌ తారలు కనిపించబోతున్నారు. ప్రభాస్‌ సరసన శ్రద్దా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం సాషాను ఎంపిక చేశారు. ప్రభాస్‌ ఆఫర్‌, ఆపై ఇంత భారీ చిత్రం అవడంతో ఏమాత్రం ఆలోచించకుండా సాషా ‘సాహో’లో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మూడు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్‌ తారలు కనిపించబోతుండడంతో తెలుగులోను, హిందీలో అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి.

sashoooo