వినాయక్‌ కోరికను బాలయ్య తీరుస్తాడా…?

Vinayak Movie With Balakrishna

టాలీవుడ్‌లో సంచలన విజయాలను అందుకుని పలు చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ఒక ట్రేడ్‌ మార్క్‌ను సొంతం చేసుకున్న వినాయక్‌కు ప్రస్తుతం మంచి ఆఫర్‌లు ఏమి లేవు. ఈయన చిత్రాలు ఎంత భారీగా ఉంటాయి అంటే రీ ఎంట్రీ ఇచ్చే సమయంలో చిరు వినాయక్‌ను ఎంపిక చేసుకున్నాడు అనేంతగా ఈయనకు క్రేజ్‌ ఉంది. చిరంజీవి ‘ఖైది నెం 150’ చిత్రంతో బారీ విజయాన్ని అందుకున్న వినాయక్‌ ఆ తర్వాత చెప్పుకోదగ్గ చిత్రాలేమి చేయలేదు. వినాయక్‌ స్టయిల్‌కు చిరు, బాలయ్యలు బాగా సూట్‌ అవుతారు అనే విషయం అందరికి తెల్సిందే.

balakrishna

వినాయక్‌ మరోసారి తన ప్రతిభను చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే బాలయ్య బాబుతో ఒక చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నాడు. ఇప్పటికే కథను సిద్దం చేసిన వినాయక్‌ బాలయ్య బాబుతో తన తదుపరి చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నాడు. బాలయ్య ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత బాలయ్య వినాయక్‌కు అవకాశం ఇస్తాడా..? అనేది చూడాలి. బాలయ్య ఈ సారి వినాయక్‌కి అవకాశం ఇస్తే అది ఇద్దరికి చాలా పెద్ద హిట్‌ అవుతుంది అనడంలో సందేహం లేదు. గతంలో వీరిద్దరి కాంభోలో వచ్చిన ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే తరహాలో ఇంకొంచెం మసాలాతో ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేయాలని వినాయక్‌ భావిస్తున్నాడు. కానీ వినాయక్‌ ఈ కోరికను బాలయ్య బాబు తీరుస్తాడా? అనేది సందేహంగానే ఉంది.

balakrishna-vinayak