మళ్లీ హరీష్‌ శంకర్‌, దిల్‌రాజు… వర్కౌట్‌ అయ్యేనా…!

Harish Shankar Going To Direct Remake Of 96MOvie

తమిళంలో తాజాగా విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘96’ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి దిల్‌రాజు ఇప్పటికే హక్కులను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిషను కూడా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దిల్‌రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించే భాద్యతను హరీష్‌ శంకర్‌ చేతిలో పెట్టాడు. ఎలాగు రీమేక్‌ చిత్రాలను తెరకెక్కించడంలో హరీష్‌ శంకర్‌కు ఉన్న నైపుణ్యం అందరికి తెల్సిందే. దాంతో కోలీవుడ్‌లో కలెక్షన్ల వరద పారిస్తున్న ఈ చిత్ర చిత్రీకరణను హరీష్‌ శంకర్‌కు అప్పగించాడు.

96-movie

దిల్‌రాజు,హరీష్‌ శంకర్‌ల కాంభోలో ఇప్పటికే పలు చిత్రాలు విడుదలయ్యాయి. ఆ చిత్రాలు పర్వాలేదు అనే టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే ఇద్దరి కాంభోలో సూపర్‌ హిట్‌ చిత్రాలేమి లేకున్నా కూడా ‘96’ కథపై ఉన్న నమ్మకంతో ఈ ఆఫర్‌ హరీష్‌ శంకర్‌ చేతికి వెళ్లింది. అయితే హరీష్‌ శంకర్‌ ఈ చిత్రానికి ఇంకా గ్రీన్‌ ఇవ్వలేదు. హరీష్‌ శంకర్‌కు కూడా ప్రస్తుతం చెప్పుకోదగ్గ విజయాలేవి లేవు కాబట్టి  ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తీసుకుంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో హీరో ఎవరు అనేది ఇంకా తెలియదు. హీరోది మధ్య వయస్సు పాత్ర కాబట్టి దిల్‌రాజు అందుకు తగ్గ హీరోని ఎంపిక చేసే పనిలో పడ్డారు.

sankar