ఆర్‌ మల్టీస్టారర్‌లో బాలీవుడ్‌ హీరో.. నిజమెంత?

ajay devgan

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. అద్బుతమైన కథతో ఈ చిత్రాన్ని జక్కన్న తెరకెక్కిస్తున్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు. ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లకు మరోసారి కెరీర్‌ బెస్ట్‌ మూవీని జక్కన్న ఇస్తాడనే నమ్మకంను అంతా కలిగి ఉన్నారు. ఇటువంటి సమయంలో ఈ చిత్రంలో ఒక బాలీవుడ్‌ హీరో నటించబోతున్నాడు అంటూ సినీ వర్గాల్లో మరియు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తల్లో నిజం ఎంత అనే విషయమై తెలుసుకునే ప్రయత్నం చేయగా, అందులో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. జక్కన్న మూవీలో ఇద్దరు హీరోలు మాత్రమే ఉంటారు. మరో హీరోకు ఛాన్స్‌ లేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.
Yash Acting On Vilan Role In RRR Movie‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మల్టీస్టారర్‌ చిత్రం కోసం విలన్‌ను ఎంపిక చేసేందుకు బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌తో చర్చలు జరిపాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని అందులో నిజం లేదని సినీవర్గాల వారు అంటున్నారు. బాలీవుడ్‌ వరకు జక్కన్న వెళ్లడని సౌత్‌లోనే ఒక హీరోను తన సినిమాకు విలన్‌గా తీసుకుంటాడని సినీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం కోకాపేటలో చిత్రీకరణ జరుపుతున్న ఈ చిత్రం షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ అప్పుడే ముగియబోతుంది. రెండవ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణతో పాటు, హీరోయిన్స్‌ కూడా ఆ షెడ్యూల్‌లో ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. విలన్‌ గా కన్నడ హీరో యష్‌ను రాజమౌళి పరిశీలిస్తున్నాడనే వార్తలో మాత్రం నిజముందని తెలుస్తోంది.