మళ్ళీ సర్దేసుకున్న ఇల్లీ బేబీ…!

Ileana Controversy Comments On Amar Akbar Anthony Movie

గోవా బ్యూటీ ఇలియానా ఒక్కపుడు తెలుగు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక్కడ పెద్ద పెద్ద స్టార్ హీరోస్ తో నటించింది. నార్త్ లో మంచి ఆఫర్స్ రావడంతో అక్కడకు వెళ్ళింది. అక్కడ కొన్ని చిత్రాల్లో నటించింది. ఆ మద్య అక్కడ ఆఫర్స్ తగ్గడం తో మరల సౌత్ ప్రయాణం పట్టింది. తెలుగు లో రవి తేజ తో అమర్ అక్బర్ అంటోనీ చిత్రం తో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ చిత్రం అట్టర్ ప్లాప్ అని టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంల్లో ఇలియానా క్యారక్టర్ కి అంత ఇంపార్టెంట్ లేదు. అసలు ఇలియానను అనవసరం గా ఈ చిత్రంల్లో పెట్టారు అన్నటాక్ కూడా వచ్చింది.

raviteja-iliayana

దీనికి తోడు మునపటి ఇలియానలా కాకుండా కొంచెం లావు అవ్వడం తో ఆమెను ఆడియన్స్ సరిగ్గా రీసివు చేసుకోలేక పోయారు. అందుకే ఆమె తిరిగి బాలీవుడ్ బాట పట్టినట్లు ఆమె సన్నిహితుల ద్వార తెలుస్తుంది. అమర్ అక్బర్ అంటోని చిత్రం ప్లాప్ తరువాత ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు రావడం కష్టమే. ఈ విషయం తెలిసిన గోవా బ్యూటీ బాలీవుడ్ కు తిరుగు ప్రయాణం పట్టినట్లు కామెంట్స్ వినిపిస్తునాయి. ఇలియానా బాలీవుడ్ కి వెళ్ళాడని ఆమె అభిమానులు జిర్ని౦చుకోలేకపోతున్నారు.