వైట్ల పరిస్థితి మరీ దారుణం, కోటిన్నర పారితోషికం నష్టం

వరుసగా నాలుగు డిజాస్టర్స్‌ వచ్చిన తర్వాత కూడా ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ అనే చిత్రంను చేసేందుకు రవితేజ ముందుకు వచ్చినా కూడా శ్రీనువైట్ల వినియోగించుకోలేక పోయాడు తన ఫ్లాప్స్‌ సంఖ్యను అయిదుకు పెంచుకున్నాడు. అద్బుతమైన స్క్రీన్‌ప్లే, భారీ బడ్జెట్‌ అంటూ ఈ చిత్రం గురించి ప్రచారం చేసిన శ్రీనువైట్ల తీరా ఏమీ లేకుండానే తీశాడు. ఈ చిత్రంకు కేవలం20 లక్షల పారితోషికంను మాత్రమే తీసుకున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఒకప్పుడు దూకుడు చిత్రం తర్వాత దాదాపు అయిదు ఆరు కోట్ల పారితోషికం అంతకు మించి పారితోషికం దక్కించుకున్న శ్రీనువైట్ల ఇప్పుడు కేవలం నెల జీతానికి పని చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అమర్‌ అక్బర్‌ ఆంటోనీ ఫ్లాప్‌తో ఇప్పుడు ఆయన స్థాయి మరీ దిగజారి పోయింది.

వైట్ల పరిస్థితి మరీ దారుణం, కోటిన్నర పారితోషికం నష్టం - Telugu Bullet

అమర్‌ అక్బర్‌ ఆంటోనీ సక్సెస్‌ అయితే కోటిన్నర పారితోషికంతో పాటు లాభాల్లో వాటా ఇస్తామని మైత్రి వారు వైట్లకు హామీ ఇచ్చారు. కాని సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో వారే భారీ నష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు వారు వైట్లకు పారితోషికం ఇచ్చే పరిస్థితిలో లేరని తెలుస్తోంది. శ్రీనువైట్ల పారితోషికం సంగతి పక్కన పెడితే అసలు ఈయనకు ఆఫర్లు ఇక రావడమే అసాధ్యం అయ్యింది. యంగ్‌ హీరోలు, కొత్త హీరోలు కూడ వైట్లకు దూరంగా జరుగుతున్న పరిస్థితి. అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్న వైట్ల ఇక సినిమా పరిశ్రమకు గుడ్‌ బై చెబితేనే బెటర్‌ అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అమర్‌ అక్బర్‌ ఆంటోనీ తర్వాత రవితేజ పరిస్థితి కూడా ఇదేనంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. ఆయన కెరీర్‌ కష్టాల్లో పడ్డట్లయ్యింది.