ఆసక్తి రేపుతున్న రవితేజ మూవీ

amar akbar anthony very exacting

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడ్డాయి. ముఖ్యంగా నేల టికెట్‌ చిత్రంపై ప్రేక్షకులు మరియు అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్లుగా చిత్రం లేకపోవడంతో పాటు, రవితేజ పాత్ర చెత్తగా ఉండటంతో సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ప్రస్తుతం రవితేజ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ మరియు టీజర్‌లు ప్రస్తుతం సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. సినిమాలో రవితేజ మూడు పాత్రల్లో నటిస్తున్నాడా లేదా మూడు షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నాడా అంటూ సినీ విశ్లేషకులకు కూడా అర్థం అవ్వడం లేదు.

ravi teja amar akbar anthony very exacting

తాజాగా శ్రీనువైట్ల బర్త్‌డే సందర్బంగా ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో రవితేజ మూడు విభిన్నమైన గెటప్స్‌లో, పూర్తిగా విరుద్దమైన మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రవితేజ మూడు పాత్రల్లో కనిపిస్తాడని, అంటే ట్రిపుల్‌ రోల్‌ అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ చిత్రంలో ఒకే ఒక హీరోయిన్‌ ఉన్న కారణంగా ఒకే పాత్ర అయ్యి ఉంటుందని కూడా అంటున్నారు. మొత్తానికి ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుకుంటుంది.