మూగ, అంధ యువతిపై వాచ్‌మెన్ రేప్…గర్భం !

Blind Girl Rape In Madhya Pradesh

వసతి గృహాల్లో అరాచకాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. సేవ పేరుతో అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలకు అంతులేకుండా పోతోంది. అమాయకులైన అమ్మాయిలపై అకృత్యాలకు ఒడిగడుతున్నారు మానవ మృగాలు. మూగ, అంధ అమ్మాయిలను కూడా వదిలిపెట్టడం లేదు కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ నీచులు. కంచే చేను మేస్తే ఏమి చేయాలో తెలియక అమాయక ఆడపిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. నరకకూపం నుంచి బయటపడే దారిలేక నలిగిపోతున్నారు. ఆశ్రయం పేరుతో అరాచకాలకు పాల్పడుతున్న ఇలాంటి నీచుల కామదాహానికి మరో యువతి బలైంది. 24 ఏళ్ల వయస్సున్న మూగ, అంధ యువతిపై వాచ్‌మెన్ అత్యాచారం చేశాడు.

forced-sex-with-wife-is-also-illegal
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండు నెలలుగా ఆ యువతిపై అఘాయిత్యానికి పాల్పడుతూ నరకం చూపించాడు ఒక షెల్టర్ హోం వాచ్ మెన్. ఆ నీచుడి నిర్వకానికి ఆమె గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న షెల్టర్ హోమ్ డైరెక్టర్ ఆశ్రమం పరువు పోతుందనే ఉద్దేశంతో ఆమెకు బలవతంగా అబార్షన్ చేయించాడు. ఆధారాలు దొరక్కుండా ఉండటానికి ఆ పిండాన్ని కాల్చేశాడు. అయితే ఈ విషయాలు మధ్యప్రదేశ్ మహిళా, చైల్డ్ సంక్షేమ శాఖ విచారణలో బయటపడ్డాయి. దీంతో వీరు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనకు కారణమైన వారదరినీ అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.