అమర్ అక్బర్ ఆంథోనీ టీజర్ …

దర్శకుడు శ్రీను వైట్ల, రవితేజతో గతంలోనే మూడు సినిమాలు ఉన్నాయి. నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను, ఈ మూడు కూడా వాళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చి హిట్ కొట్టినవే. ఇలా రవితేజతో మూడు సినిమాలు చేసిన శ్రీను వైట్ల, ఇప్పుడు రవితేజతో మూడు పాత్రలు వేయిస్తూ తీస్తున్న సినిమా అమర్ అక్బర్ ఆంథోనీ. రవితేజ ఈ సినిమాలో మూడు పాత్రలు చేయడం మనకి తెలిసిన విషయమే, అయితే ఈ మూడు పాత్రల ద్వారా రవితేజ తన ఫాన్స్ కి ట్రిపుల్ ధమాకా ఇవ్వబోతున్నారు. అయితే, రిలీజ్అయిన పోస్టర్స్ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి, అలాగే కొత్తగా ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి. ఈ మధ్యనే ఒక టీజర్ వీడియో కూడా రిలీజ్ అయ్యింది, అలాగే అందరికీ నచ్చింది, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి మంచి మార్కులు కూడా పాడాయి.


అయితే, ఈ పోస్టర్స్, వీడియోస్ చూస్తుంటే ఇదేదో ఒక రివేంజ్ యాక్షన్ స్టొరీ ల ఉంది. మామూలుగానే, రవితేజ సినిమా అంటే ప్రేక్షకులలో ఒక ఆసక్తి ఉంటుంది. అలాంటిది, శ్రీను వైట్ల కాంబినేషన్ లో సినిమా అంటే అవి ఇంకొంచెం పెరుగుతాయి అనడంలో డౌటే లేదు. అలాగే, ఈ మద్యం మైత్రి మూవీ మేకర్స్ వారి సినిమాలో మంచి సినిమాలుగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి, మరియు వసూళ్ళను కూడా రాబడుతున్నాయి. వారి ప్రొడక్షన్ లో వచ్చే సినిమా కాబట్టి ఇంకొంచెం అంచనాలు పెరుగుతాయి. ఆ విధంగా, ఈ రోజు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కొన్ని రోజుల క్రితమే విడుదల అవ్వాల్సిన ఈ ట్రైలర్ ఇప్పుడు మన ముందుకి వచ్చింది.