మాయ విషయంలో పోస్టు జారిన బాబు !

కాలు జారితే తీసుకోవచ్చు నోరు జారితే వెనక్కి తీసుకోలేమనేది పాత మాట, ఇప్పుడు కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు సోషల్ మీడియాలో పోస్టు జారితే వెనక్కు తీసుకోవడం కష్టం అని చెప్పుకునే రోజులు వచ్చేశాయి. ఇప్పుడు సామాన్య ప్రజలే పొరపాటున ఏమైనా తప్పు మాట్లాడితే నిముషాల్లో వైరల్ అవుతోంది. అటువంటిది కాస్త సెలబ్రిటీలు అయితే ఇంకా చెప్పేదేముంది వారి పరువు అడ్డంగా తీసి పారేస్తారు నెటిజన్లు తాజాగా అదే పరిస్థితి చంద్రబ్బుకు కూడా ఎదురయ్యింది. తాజాగా తన ఢిల్లీ పర్యటనలో పలు జాతీయ స్థాయి నేతలను కలిసిన ఆయన పనిలో పనిగా బీస్పీ నేత కుమారి మాయావతిని కూడా కలిసి వచ్చారు. అయితే అక్కడి వరకూ బాగానే ఉంది. ఆ తర్వాత ట్విట్టర్ లో చంద్రబాబు తాను శ్రేమతి మాయావతిని కలిసినట్టు ఆమెతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇక్కడే వచ్చింది చిక్కంతా కుమారిని పట్టుకుని శ్రీమతి అంటారా అంటూ ఒక వర్గం బాబు మీద సోషల్ మీడియా దాడిని ప్రారంభించింది.

CBN And Mayawati