మాస్‌ మహారాజా… మళ్లీ అలాగేనా…?

Ravi Teja New Movie Trailer Release On 29th

మాస్‌ సినిమాలు ఆడినంత కాలం మాస్‌ మహారాజ్‌ రవితేజ బిగెస్ట్‌ హిట్‌లను దక్కించుకుంటూ కెరియర్‌ను డోకా లేకుండా ముందుకు తీసుకుపోయాడు. కానీ గతకొంత కాలంగా మాస్‌ సినిమాల ట్రెండ్‌ పోయి యూత్‌ఫుల్‌ క్లాస్‌ చిత్రాల ట్రెండ్‌ వచ్చింది. అయినా రవితేజ మాస్‌ సినిమాలనే చేసి పరాజయాన్ని చవి చూశాడు. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ను కొట్టాలనుకుంటున్నాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్‌. గత చిత్రాలలాగే ఈ చిత్రంలో కూడా రాడ్‌ పట్టుకుని మాస్‌ హీరోగానే కనిపిస్తున్నాడు.

amar akbar anthony very exacting

మాస్‌ చిత్రాల కాలం చెల్లిపోయిందని తెలిసి కూడా రవితేజ మళ్లీ అదే తరహాలో నటించడం వల్ల ఈ సారి కూడా నిరాశే మిగుతుందా అని రవితేజ అభిమానులు టెన్షన్‌ పడుతున్నారు. ఈ చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల కెరియర్‌ కూడా కాస్త నెమ్మదిగా ఉంది. దాంతో ఈ చిత్రం కూడా ప్రేక్షకును ఆకట్టుకోవడంలో విఫలం అవుతుందా ఆందోళన పడుతున్నారు. ఈ నెల 29న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టుగా చిత్ర యూనిట్‌ ప్రకటించారు. ట్రైలర్‌లో అయినా కాస్త కొత్త దనాన్ని చూపిస్తే పర్లేదు కానీ ఇలాగే మాస్‌ యాంగిల్స్‌ మాత్రమే చూపిస్తే ఆశించిన స్థాయిలో మాస్‌ మహారాజ్‌కు హిట్‌ పడడం కష్టమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Amar Akbar Antony First Look