‘సవ్యసాచి’ పాత్రలను లీక్‌ చేసిన నిధిఅగర్వాల్‌…!

Nidhi-Agarwal-Leaks-Info-Fr

అక్కినేని నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబోలో ‘ప్రేమమ్‌’ చిత్రం వచ్చి మంచి సక్సెస్‌ అయ్యింది. తాజాగా మరో చిత్రం ఈ కాంబినేషన్‌లో రాబోతుంది. ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంతో మిశ్రమ స్పందనను దక్కించుకున్న చైతూ ఈసారి ఎలాగైనా మంచి సక్సెస్‌ను పొందాలనుకుంటున్నాడు. అందుకే విభిన్నమైన కథలను తెరకెక్కించే చందూతో సినిమా ప్లాన్‌ చేశాడు. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్‌ తాజాగా విడుదలయి మంచి స్పందనను దక్కించుకుంది. సినిమాపై ఆసక్తి కలిగేలా ట్రైలర్‌ ఉంది. ఈ ట్రైలర్‌లో హీరో నాగచైతన్య ఎడమ చేయి తన ఆధీనంలో ఉండని వ్యక్తిగా కనిపించబోతున్నట్టు చూపించారు.

Savyasachi

తాజాగా మీడియాతో ముచ్చటించిన ‘సవ్యసాచి’ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌… ఎడమ చేయి తన ఆదీనంలో ఉండని వ్యక్తిగా నటించడం చాలా కష్టం, అయినా కూడా చైతూ చాలా తెలివిగా ఈ చిత్రంలో మ్యానేజ్‌ చేశాడు, ఈ చిత్రంలో నేను ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాను, ఆకట్టుకునే విధంగా మంచి లవ్‌స్టోరీని ఈ చిత్రంలో ప్లాన్‌ చేశారని, దర్శకుడు తన పాత్రకు స్కోప్‌ ఉండే విధంగా లవ్‌ స్టోరీ ప్లాన్‌ చేసినందుకు కృతజ్ఞతలు అని, ఈ చిత్రం తప్పకుండా అందరికి నచ్చుతుందని, తనది హైద్రాబాదేనని, అక్కినేని హీరో నాగచైతన్యతో నటించడం చాలా సంతోషంగా ఉందని నిధి చెప్పుకొచ్చింది. ఈ చిత్రం నవంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Savyasachi