‘అదుగో’ రాబోతుంది.. కానీ కష్టమే…!

Ravi Babu Adhugo Releasing On November 7th

విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తాడు అని పేరును సొంతం చేసుకున్న దర్శకుడు రవిబాబు గత రెండేళ్లుగా ‘అదుగో’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర కథ పందిపిల్ల చుట్టూ తిరుగుతూ ఉండబోతుందని, అందుకే రవిబాబు పంది పిల్లలను స్వయంగా పెంచుకుంటున్న విషయం తెల్సిందే. పంది ప్లి చుట్టూ తిరిగే ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని రవి బాబు ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలాసార్లు విడుదలకు ప్రయత్నించిన ఈ చిత్రానికి మంచి ముహుర్తం దొరకలేదు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేసి హడావుడి మొదలెట్టి ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు.

adugo-movie-trailler

తాజాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్‌ 7న విడుదల చేయనున్నట్టుగా చిత్ర యూనిట్‌ ప్రకటించారు. మంచి పండగ సీజన్‌ చూసి ఈ విడుదల ప్లాన్‌ చేసి చిత్ర యూనిట్‌ పెద్ద సాహసమే చేస్తున్నారు. దీపావళి బరిలో ఇప్పటికే పెద్ద చిత్రాలు, చిన్న చిత్రాలు చాలా ఉన్నాయి. అలాంటి చిత్రాలు ఉండగా రవిబాబు ‘అదుగో’ను ప్రేక్షకులు పట్టించుకోవడం కష్టమే అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చాలాకాలంగా ఎన్నో ఆశలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న రవిబాబు కాస్త అటుఇటుగా విడుదల చేస్తే బావుండేది అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ పందిపిల్ల కామెడీ అందరికి తప్పకుండా నచ్చుతుదంనే గట్టి నమ్మకంతో రవిబాబు ‘అదుగో’ను పెద్ద చిత్రాలతో పాటుగా విడుదల చేస్తున్నాడు. ‘అదుగో’ ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి మరి.

adugo-movie