రవిబాబు ఇమేజ్‌ డ్యామేజ్‌…!

Ravi Babu Says Please Kill My Father

విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న రవిబాబు ఈమద్య కాలంలో అన్ని చెత్త సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఈయన తెరకెక్కించిన ‘అదుగో’ చిత్రం ఈయన కెరీర్‌లో మరింత పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. పంది పిల్లతో సినిమా అంటూ అందరిలో ఆసక్తిని కలిగించిన దర్శకుడు రవిబాబు సినిమా పరమ చెత్తగా తీయడంతో చీ అంటూ రవిబాబుపై అంతా కూడా చిత్కారాలు చేస్తున్నారు. రవిబాబు ఇన్నాళ్లు చేసింది ఈ పిచ్చి సినిమానా, ఇంత మంచి ప్రతిభ ఉందనుకున్న దర్శకుడు చేసిన సినిమా ఇదా అంటూ నిటూర్చుతున్నారు. రవిబాబు తెరకెక్కించిన సినిమాలు అన్ని కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టాయి. కాని అదుగో మాత్రం నష్టాలను మిగిల్చింది.

adugo-movie

దాదాపు రెండున్న కోట్ల బడ్జెట్‌తో సురేష్‌బాబు మరియు రవిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే సినిమా కనీసం 50 కోట్లు కూడా తీసుకు రాలేక పోయింది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ చిత్రం వల్ల సురేష్‌బాబుకు మరియు రవిబాబు ఆర్థికంగా కూడా నష్టం అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నో గొప్ప సినిమాలను తీసిన సురేష్‌బాబు ఇంత చెత్త సినిమాను ఎలా తీయగలిగాడు, ఇంత చెత్త సినిమాను ఎందుకు నిర్మించాడు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సురేష్‌బాబు మరియు రవిబాఋ ఈ చిత్రంతో చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.