బోయపాటిని కూడా లైన్‌లో పెట్టిన చిరు

మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. ‘ఖైదీ నెం.150’ చిత్రం విడుదలై దాదాపు రెండు సంవత్సరాలు కాబోతుంది. అయినా ఇప్పటి వరకు తదుపరి చిత్రాన్ని విడుదల చేయలేదు. భారీ బడ్జెట్‌తో సైరాను చేస్తున్న చిరంజీవి వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. రికార్డు స్థాయిలో అంచనాలున్న ఆ ఈచిత్రం తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమా ఇప్పటికే ఖరారు అయ్యింది. రామ్‌ చరణ్‌ నిర్మించబోతున్న కొరటాల శివ మూవీలో చిరంజీవి నటించనున్నాడు. కొరటాల శివ చాలా విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. ఒకవైపు కొరటాల మూవీ రెడీ అవుతున్న సమయంలోనే బోయపాటి మూవీ కూడా చిరంజీవి చేస్తాడంటూ మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

బోయపాటిని కూడా లైన్‌లో పెట్టిన చిరు - Telugu Bullet

ప్రస్తుతం రామ్‌ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న బోయపాటి ఆ తర్వాత చిరంజీవి కోసం కథను సిద్దం చేయనున్నాడట. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది చివరి వరకు ఆ సినిమా ప్రారంభం కాబోతుంది. అల్లు అరవింద్‌తో కలిసి రామ్‌ చరణ్‌ ఆ సినిమాను కూడా నిర్మించబోతున్నాడు. తండ్రితో వరుసగా సినిమాలు చేయిస్తున్న రామ్‌ చరణ్‌ తన సినిమాల విషయంలో మాత్రం కాస్త అశ్రద్ద చూపుతున్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి 2019వ సంవత్సరంలో సైరా చిత్రంతో పాటు కొరటాల శివ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక బోయపాటి మూవీ 2020 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి చిరంజీవి ఈ వయస్సులో కూడా స్పీడ్‌గా సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నారు.