ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదట…జగన్ అనుచిత వ్యాఖ్యలు…!

Jagan Shock To AP Police Officials Rejects To Give Statement

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై నిన్న విశాఖపట్నం విమానాశ్రయంలో ఓ యువకుడు కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందిన జగన్ ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు డిశ్చార్జ్ అయ్యారు. అయితే విడుదల అయ్యేముందు జగన్ ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందానికి(సిట్) వాంగ్మూలం ఇచ్చినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆంధ్రా పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించినట్లు వెలుగులోకి వచ్చింది. ఏదైనా ఏజెన్సీ వారితో కలిసి వస్తే వాంగ్మూలం ఇస్తానని చెప్పారు. దీంతో పోలీసుల బృందం అక్కడి నుంచి వెనుదిరిగింది. కాగా సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగన్ తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

jagan-shok

తెలంగాణ పోలీసులు విచారణకు వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. ఏపీ పోలీసులకు మాత్రం తాను వాంగ్మూలం ఇవ్వబోనని కరాఖండిగా చెప్పేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని సిట్ అధికారులు మౌనంగా అమరావతికి వెనుదిరిగారు. ఇది కొంచెం బాధ పడాల్సిన విషయమే, ఎందుకంటే జగన్ ఇలా మాట్లాడడం మొదటిసారి కాదు తొలుత ఆయన సభ్యుడిగా ఉన్న ఆంధ్రా అసెంబ్లీ మీద నమ్మకం లేదన్నారు. తర్వాత నిన్న విశాఖలో డాక్టర్ లలో చూపించుకోకుండా ఆంధ్రా డాక్టర్ల మీద నమ్మకం లేదని హైదరాబాద్ కు పరిగెత్తుకు వచ్చారు. ఇప్పుడేమో ఆంధ్రా పోలీసుల మీద నమ్మకం లేదని చెబుతూ వారిని అవమానించి పంపారు. అసలు ఆంధ్రా అంటే ఏమీ నమ్మని జగన్ ను ఆంధ్రా ప్రజలు ఎందుకు నమ్మి వోట్లు వేయాలో ? ఆ వైసీపీ వారు అయినా చెప్పగలరో లేదో ?

jagan-cm