హిజ్రా గా మారిన అక్షయ్ కుమార్

హిజ్రా గా మారిన అక్షయ్ కుమార్

కాంచన-2 హిందీలో రీమేక్ చేస్తు రానున్న సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. విజయవంతంగా ప్రదర్శింపబడి కాంచన హారర్ కామెడీ సిరీస్ తో లారెన్స్ కి నటనలోనే కాక దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. తమిళభాషలో, తెలుగుభాషలో ఈ సిరీస్ లో వచ్చిన మొత్తం నాలుగు చిత్రాలు బాగా ప్రేక్షకఆదరణ పొందాయి. కాంచన-2  రీమేక్ హిందీలో వచ్చే ఏడాదిలో విడుదలకానుంది.

అక్షయ్ కుమార్ హిజ్రాగెటప్ లో ఉన్నస్టిల్ చిత్రయూనిట్ విడుదల చేసింది.ముఖాన పెద్దబొట్టు పెట్టుకుని, అమ్మవారి గుడిలో ఎర్రచీరతో అక్షయ్ ఉన్న స్టిల్ అభిమనులలో ఆసక్తి పెంచుతుంది.ఇంతకిముందే చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది.అక్షయ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తున్నారు.“లక్ష్మీబాంబ్” టైటిల్ ఖరారుఅయిన ఈ చిత్రానికి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు.