ఆకాశవాణి ఖర్చు చాలా ఎంతో తెలుసా…?

Akashvani Movie Budget 4 Crores

రాజమౌళి ఫ్యామిలీలో ఒక్క హీరో తప్ప సినిమాకు సంబందించిన అన్ని రంగాల వారు ఉన్నారు. డైరక్టర్, సింగర్, మ్యూజిక్ డైరక్టర్, స్టొరీ రైటర్ ఇలా అన్ని రంగాల వారు ఉన్నారు. తాజాగా ఈ లిస్టులోకి సినిమా నిర్మాత కూడా చేరాడు. రాజమౌళి తనయుడు కార్తికేయ ఆకాశవాణి అనే సినిమాను నిర్మించనున్నాడు. రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేసినా అశ్విన్ గంగరాజు ఆకాశవాణి అనే చిత్రాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. నిర్మాత కార్తికేయ ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ అండ్ లోగోని ఇటివలే విడుదలచేసి సినిమా పైన మంచి ఇంట్రెస్ట్ కల్పించాడు. కీరవాణి కొడుకు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను నిర్మించేందుకు కార్తికేయ బడ్జెట్ 4 కోట్ల పరిధి పెట్టుకున్నాడట, అంతకు మించి ఒక్క రూపాయిని కూడా ఖర్చు వద్దని దర్శకుడికి చెప్పాడట.

Akashvani-Movie-Budget-4-Cr

కథ విషయానికి వస్తే ఇందులో పెద్దగా హీరోస్ అండ్ విలన్స్ ఎవ్వరు లేరు. అదే విధంగా ప్రతి పాత్ర చుట్టూ బలమైన కథను అల్లుతున్నాడు దర్శకుడు. కార్తికేయ మాత్రం ఓ స్టార్ హీరోని ఇందులో విలన్ గా నటింపజేయ్యాలి ప్లాన్ చేస్తున్నాడు. కానీ స్టార్ హీరోని తీసుకుంటే పారితోషికం ఎక్కువ ఇవ్వవలిసి ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. అందుకే సాయి కుమార్ బ్రదర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, క్యారక్టర్ ఆర్టిస్ట్, రవిశంకర్ ను మెయిన్ పాత్రలో నటింపజేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. తక్కువ బడ్జెట్ అయినా కూడా రాజమౌళి పేరుతో సినిమాకు భారీ బిజినెస్ అవ్వడం ఖాయం అంటున్నారు.