విజయ్ డేట్స్ కోసం ఓ స్టార్ డైరక్టర్…!

Director Mani Ratnam Next Movie With Vijay Thalapathy

వరస ప్లాప్ ల తర్వాత డైరక్టర్ మణిరత్నం ఈ మద్య తమిళంలో ‘చెక్క చివంత వానమ్’ చిత్రాని తీశాడు. ఆ చిత్రం తమిళనాడులో ఘనవిజయం ను సాదించింది. స్టార్ హీరో విజయ్ సర్కార్ తో పోటిపడి మరి మంచి వసూళ్లను రాబటింది. తెలుగు లో ఈ చిత్రం నవాబ్ పేరుతో విడుదలై మంచి టాక్ ను దక్కించుకోవడమే గాక మంచి కలెక్షన్స్ సాదించింది. మణిరత్నం మరల మున్నపటి ఫాంను మరల అంది పుచ్చుకున్నాడు. తాజాగా అయన మరో భారీ మల్టీ స్టార్ చిత్రాని తెరకెక్కించేందుకు రంగం సిద్దం చేస్తున్నాడు. తమిళ స్టార్ హీరోస్ విక్రం, విజయ్, శింభు ను ఈ చిత్రంలో నటింపజేసేందుకు, మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడు. కానీ విజయ్ కు ఇప్పుడు ఉన్నా క్రేజీని మణిరత్నం తన తీయబోయే సినిమాకు ఉపగించుకోవాలి అనుకుంటున్నాడు.

Mani-Ratnam--multistarrer-m

శింభు, విక్రం డేట్స్ దొరికినా కానీ, విజయ్ డేట్స్ మాత్రం అంత ఈజీగా దొరకవు. తమిళ డైరక్టర్ అట్లి కుమార్, విజయ్ తో నెక్స్ట్ సినిమా తీసేందుకు సిద్దం గా ఉన్నాడు. మరో ఇద్దరు డైరక్టర్స్ విజయ్ కి కథ చెప్పి ఒపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కావునా ఇలాంటి సమయంలో విజయ్ డేట్స్, మణి రత్నం అంత తొందరగా దొరకవు అనే అభిప్రాయం కూడా లేకపోలేదు. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, నాని ఎప్పటి నుండో మణిరత్నం దర్శకత్వంలో నటించాలి అని కలలు కంటున్నారు. మణిరత్నం చూపు మాత్రం తమిళ హీరోస్ వైపు మాత్రమే ఉన్నది. సో మణిరత్నం సినిమాలో ఈసారైన తెలుగు వారికీ అవకాశం దక్కుదేమో చూడాలి.