దిల్‌రాజు రికార్డ్‌ కోరిక… ‘హలో’కు కష్టాలు

Akhil Hello Troubles because Dil Raju Confirms to Nani MCA release Date

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అఖిల్‌ మొదటి చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో రెండవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. నాగార్జున కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ అఖిల్‌ రెండవ సినిమాను నిర్మించాడు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నాగార్జున ‘హలో’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ‘హలో’ చిత్రాన్ని సోలోగా విడుదల చేయాలని నాగార్జున చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే నాని ‘ఎంసీఏ’ చిత్రంతో హలో పోటీ పడాల్సిన పరిస్థితి. నాని ఇటీవల వరుసగా సక్సెస్‌లు దక్కించుకుని దూసుకు పోతున్నాడు. దాంతో నానితో హలో చిత్రానికి కష్టాలు తప్పవని సినీ వర్గాల వారు అంటున్నారు. దిల్‌రాజును ఒప్పించి ‘ఎంసీఏ’ చిత్రాన్ని వాయిదా వేయించాలని నాగార్జున చాలా ప్రయత్నాలు చేశాడు. కాని అది సాధ్యం కాలేదు.

తాజాగా దిల్‌రాజు మీడియా ముందుకు వచ్చాడు. మరోసారి ‘ఎంసీఏ’ చిత్రం ఈనెల 21న విడుదల చేయబోతున్నాం అంటూ ప్రకటించాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అని, విడుదల వాయిదా గురించి ఆలోచనే లేదు అంటూ పేర్కొన్నాడు. ఇక ఇంత పట్టుదలగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి కారణం రికార్డు కోసం అంటూ దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు. ఈ సంవత్సరంలో దిల్‌రాజు బ్యానర్‌లో అయిదు సినిమాలు వచ్చాయి. ఆ అయిదు కూడా భారీ విజయాలను దక్కించుకున్నాయి.

ఈ చిత్రాన్ని కూడా ఇదే సంవత్సరం విడుదల చేసి డబుల్‌ హ్యాట్రిక్‌ దక్కించుకోవాలని చూస్తున్నామని, ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నామని, స్క్రిప్ట్‌ వర్క్‌ జరిపేప్పుడే ఇదే సంవత్సరంలో సినిమాను తీసుకు రావాలని భావించామని, ఆగస్టులోనే సినిమా విడుదల డిసెంబర్‌లో అంటూ నిర్ణయించుకున్నాం అంటూ దిల్‌రాజు చెప్పుకొచ్చాడు. దిల్‌రాజు డబుల్‌ హ్యాట్రిక్‌ కోసం అఖిల్‌ ‘హలో’ సినిమాకు కష్టాలు తప్పేలా లేవు. ‘ఎంసీఏ’ చిత్రం సూపర్‌ హిట్‌ అయితే ఖచ్చితంగా ‘హలో’ సినిమాపై ప్రభావం ఉంటుంది.