కొత్త మెగా హీరో రెడీ.. ముహూర్తం ఫిక్స్‌

megha hero kalyan new movie shooting start on february

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా ఫ్యామిలీ నుండి వరుసగా హీరోలు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలువురు హీరోలు మెగా ఫ్యామిలీ నుండి టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. మరి కొందరు మెగా ఫ్యామిలీ నుండి తెలుగు ప్రేక్షకుల కోసం ఎదురు చూస్తున్నారు. సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు, మెగా బ్రదర్స్‌ మరో మేనల్లుడు త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక గత కొన్నాళ్లుగా చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా కళ్యాణ్‌ ఎంట్రీపై క్లారిటీ వచ్చింది. కొన్ని నెలలుగా కళ్యాణ్‌ సినిమాకు సంబంధించి ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడు. హీరోకు ఉండాల్సిన మంచి ఫిజిక్‌ ఉన్న కళ్యాణ్‌ పూర్తి స్థాయిలో నటన శిక్షణ తీసుకున్నాడు.

chiranjeevi-son-in-law-kaly

కళ్యాణ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు కథ మరియు దర్శకుడు ఫిక్స్‌ అయ్యాడు. ‘జత కలిసే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన రాకేష్‌ శశి దర్శకత్వంలో కళ్యాణ్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇటీవలే కథను ఫైనల్‌ చేశారు. నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. చాలా కథలు విన్న తర్వాత సాయి కొర్రపాటి ఈ కథను ఫైనల్‌ చేయడం జరిగింది.

Actor Ram Charan has reportedly been guiding the entire team

రామ్‌ చరణ్‌తో పాటు మెగా ఫ్యామిలీకి కథ నచ్చిందని, ఫిబ్రవరిలో సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లే అవకాశాలున్నాయి అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కళ్యాణ్‌ హీరోగా మంచి సక్సెస్‌ను దక్కించుకుంటాడు అని, కళ్యాణ్‌కు టాలీవుడ్‌లో మంచి ఫ్యూచర్‌ ఉంటుందని మెగా ఫ్యామిలీ వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్‌ నటించే చిత్రం వచ్చే సంవత్సరం ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.