Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా ఫ్యామిలీ నుండి సంవత్సరంకు ఒక్కరు ఇద్దరు చొప్పున ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి దాదాపు డజను మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. తాజాగా మరో ఇద్దరు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే చిరంజీవి చిన్న కూతురు భర్త కళ్యాణ్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కుతుంది. ఆ చిత్రాన్ని రాకేష్ శశి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఆ చిత్రం ఒక క్యూట్ లవ్ స్టోరీతో, తక్కువ బడ్జెట్‌తో సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఈయన శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు.
మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న హీరోలు కనుక స్టార్ దర్శకులు కూడా వారితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. కాని కళ్యాణ్ మరియు వైష్ణవ్‌లను చిన్న దర్శకుల దర్శకత్వంలో పరిచయం చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటా అని ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ కూడా ఆలోచనల్లో పడ్డాడు. అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మెగా హీరోల పరిచయం చిన్న చిత్రాల నుండి మొదలు కావాలని మెగా ఫ్యామిలీ పెద్దలు భావించారట. చిన్న చిత్రాలతో సత్తా చాటి ఆ తర్వాత పెద్ద సినిమాలతో హీరోలుగా పేరు తెచ్చుకోవాలని, అప్పుడే ఫ్యాన్స్‌లో మరియు ప్రేక్షకుల్లో గౌరవంగా ఉంటుందనేది వారి అభిప్రాయం. అందుకే మెగా ఫ్యామిలీ నుండి ఇకపై ఎవరు వచ్చినా కూడా చిన్న దర్శకులతోనే మొదట సినిమా చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.