బ్రో మూవీ ఓటీటీలో ఎప్పుడు?

Bro The Avatar movie ott release date
Bro The Avatar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు చాలు ప్రేక్షకుల పూనకాలు వచ్చినట్టు ఊగిపోతారు .అయన ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాణిస్తూ.. మరోవైపు వరుస సినిమాలను చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన సినిమా బ్రో పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. బ్రో సినిమాని, తమిళ సినిమా వినోదయ సీతమ్ రీమెక్ గా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. జులై 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది.

వినోదయ సీతమ్ అంటే తమిళంలో వెర్రి మనస్సు అని అర్థం. కానీ సముద్రఖని ఈ సినిమాని తెలుగులో బ్రో అనే పేరుతో తీశారు. తొలుత ఈ చిత్రానికి టైటిల్ కాల పురుషుడు అనుకున్నట్టు దర్శకుడు సముద్రఖని చెప్పుకొచ్చారు. ఈ టైటిల్ వినడానికి మాస్ గా, పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ ఈ టైటిల్ సినిమా కంటెంట్ తప్పు అంచనాలకు దారి తీస్తుందని దర్శకుడు సముద్ర ఖని భావించి బ్రో అని ఫిక్స్ చేశాడు. మాములుగా సముద్రఖని నటించడమే కాదు, ఈ చిత్రానికి డైరెక్టర్ గా కూడా చేశారు. మాటలు అందిస్తూ.. తెరవెనుక త్రివిక్రమ్ శ్రీనివాస్.అన్నీ తానై చూసుకున్నారు

బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ ,సుఫ్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి కనిపించడంతో మెగా అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అద్భుతంగా ఉందనే చెప్పవచ్చు. బ్రో మూవీని ఓటీటీలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 02 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అధికారికంగా మాత్రం ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరలమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో OG వంటి సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.