చిరు చిన్నల్లుడి పేరు మార్పు ఇందుకేనా?

reason behind Chiranjeevi Son In Law Kalyan Kanuganti name Changed As Kalyan Dhev

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ హీరోగా ఒక చిత్రం తెరకెక్కబోతుంది. నేడు ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ లాంచనంగా ప్రారంభం అయ్యింది. మీడియాకు ఒక ప్రెస్‌ నోట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చన చిత్రం విడుదల చేయడం జరిగింది. ఆ ప్రెస్‌ నోట్‌లో కళ్యాణ్‌ పేరుకు దేవ్‌ను యాడ్‌ చేయడం జరిగింది. చిరంజీవి కూతురును వివాహం చేసుకున్నప్పటి నుండి కూడా కళ్యాణ్‌ అంటూ పేరు ప్రచారం జరుగుతుంది. ఉన్నట్లుండి ఇప్పుడు కళ్యాణ్‌ దేవ్‌ అంటూ పేర్కొనడంతో కొంత ఆసక్తి కలుగుతుంది. దేవ్‌ అనే పదం ఇప్పుడు యాడ్‌ చేశారా లేక మొదటి నుండి కూడా కళ్యాణ్‌ పేరు తర్వాత దేవ్‌ ఉందా అంటూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సినిమాల్లోకి కళ్యాణ్‌ను తీసుకు రావాలని భావించిన తర్వాత మెగా ఫ్యామిలీకి సంబంధించిన కొందరు ప్రముఖులు న్యూమరాలజిస్ట్‌ను సంప్రదించడం జరిగిందట. ఆ సమయంలో కళ్యాణ్‌ పేరుకు దేవ్‌ అని కలిస్తే అదృష్టం కలిసి వస్తుందని చెప్పారట. దాంతో పాటు పవన్‌ కళ్యాణ్‌ మెగా ఫ్యామిలీలో ఇప్పటికే ఉన్నాడు. అందుకే కళ్యాణ్‌ అని సింపుల్‌గా ఉండటం కంటే మరో పదం చేర్చితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఈ రెండు కారణాల వల్ల కళ్యాణ్‌ పేరు తర్వాత దేవ్‌ను జత చేసినట్లుగా తెలుస్తోంది.

గతంలో పలువురు హీరోలు మరియు హీరోయిన్స్‌ సినిమాల్లోకి ఎంటర్‌ అయ్యే ముందు పేరు మార్చుకోవడం చేశారు. ఎవరి విషయమో ఎందుకు చిరంజీవి మరియు పవన్‌ కళ్యాణ్‌లు తమ పేర్లను మార్చుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు అదే దారిలో కళ్యాణ్‌ కూడా పేరును మార్చుకుని సక్సెస్‌ అవ్వాలని చూస్తున్నాడు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న ఈ చిత్రంతో కళ్యాణ్‌ మెగా ఇమేజ్‌ను కాపాడుకుని సక్సెస్‌ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.