కళ్యాణ్‌ దేవ్‌ తర్వాత సినిమాకు గ్యాప్‌

kalyan dev planning on his next movie

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా తాజాగా ‘విజేత’ చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. రాకేశ్‌ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన ‘విజేత’ విజయాన్ని సొంతం చేసుకోవడంలో విఫలం అయ్యింది. సినిమా కథ మరియు కథనం బాగా లేకపోవడంతో పాటు, చిత్రంలోని కళ్యాణ్‌ నటన ఏమాత్రం బాగా లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే మెగా ఫ్యామిలీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. కళ్యాణ్‌ దేవ్‌ యాక్టింగ్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తర్వాత సినిమాకు కాస్త గ్యాప్‌ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

కళ్యాణ్‌ దేవ్‌ ‘విజేత’ చిత్రం ప్రారంభంకు ముందు ఆరు నెలల పాటు యాక్టింగ్‌ స్కూల్‌కు వెళ్లాడు. అయితే కళ్యాణ్‌ నటన మరియు బాడీలాంగ్వేజ్‌ విషయంలో విమర్శలు వచ్చాయి. దాంతో కళ్యాణ్‌ను మరికొంత కాలం యాక్టింగ్‌ శిక్షణకు పంపించాలనే నిర్ణయానికి చిరంజీవి అండ్‌ కో వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు కళ్యాణ్‌ మొహంపై రెండు ఆపరేషన్స్‌ కూడా చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయంకు మెగా ఫ్యామిలీకి వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి కళ్యాణ్‌ రెండవ సినిమా 2020 వరకు వచ్చే అవకాశం లేదని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ‘విజేత’ పూర్తి అయిన వెంటనే హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా సినిమా మొదలు పెట్టాలని భావించారు. కాని విజేత ఫలితం తారుమారు అవ్వడంతో మెగా ఫ్యామిలీ ఆలోచన మార్చుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ విషయమై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.