విజేత మూవీ రిలీజ్ డేట్… జులై 12

Vijetha movie release date

నటీ నటులు : క‌ళ్యాణ్ దేవ్, మాళ‌విక మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పృథ్వి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్, మహేష్‌విట్టా తదితరులు

సినిమాటోగ్ర‌ఫీ: కేకే సెంథిల్ కుమార్
సంగీతం : హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్
ఎడిటింగ్ : కార్తిక శ్రీ‌నివాస్
లిరిక్స్ : రెహ‌మాన్, రామ‌జోగ‌య్య‌శాస్త్రి
ఆర్ట్ డైరెక్ట‌ర్ : రామ‌కృష్ణ‌
స‌మ‌ర్ప‌ణ‌ : సాయి శివాణి
నిర్మాత‌ : ర‌జినీ కొర్ర‌పాటి (సాయి కొర్ర‌పాటి ప్రొడ‌క్ష‌న్)
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు : రాకేశ్ శ‌శి

కళ్యాణ్‌దేవ్ హీరోగా నటించిన విజేత సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యు సర్ట్ఫికెట్ పొందింది. ఈనెల 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌దేవ్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. రమేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా తండ్రీ, కొడుకుల మధ్య నడిచే కథగా తెరకెక్కింది. విజేత ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి.

మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మురళీశర్మ కళ్యాణ్‌దేవ్ తండ్రి పాత్రలో నటించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కె.కె.సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శశి, నిర్మాత: రజినీ కొర్రపాటి, సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్, ప్రెజెంటర్: సాయిశివాని, కెమెరామెన్: కె.కె.సెంథిల్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, సాహిత్యం: రెహమాన్, రామజోగయ్యశాస్ర్తీ, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ, స్టంట్స్: జాషువ.