‘విజేత’ నిర్మాతను ఆదుకోబోతున్న మెగా ఫ్యామిలీ!

Will Mega Family Repay The Vijetha Losses

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘విజేత’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచిన విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాల నడుమ విడుదలైన ఆ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. నిర్మాత సాయి కొర్రపాటి ఆ చిత్రం వల్ల ఏకంగా 7 కోట్ల మేరకు నష్టపోయినట్లుగా సమాచారం అందుతుంది. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘విజేత’కు కేవలం మూడు కోట్లు మాత్రమే రిటర్న్‌ వచ్చాయని, దాంతో నిర్మాత పీకల్లోతు నష్టాల్లో కూరుకు పోయే పరిస్థితి వచ్చింది అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. సినిమా ప్రారంభంకు ముందే నిర్మాతకు మెగాస్టార్‌ చిరంజీవి హామీ ఇచ్చాడు అని, ఒకవేళ సినిమా ఫ్లాప్‌ అయితే తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇవ్వడం వల్లే కొత్త హీరో అయినా కూడా సాయి కొర్రపాటి 10 కోట్లను ఖర్చు చేయడం జరిగింది.

సాయి కొర్రపాటికి వచ్చిన నష్టంను ఆయనతో ఒక సినిమాను చేసేందుకు ముందుకు వచ్చి భర్తీ చేయాలని మెగా హీరోలు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ డేట్లు ఖాళీగా ఉన్న కారణంగా సాయి కొర్రపాటి నిర్మాణంలో బన్నీ ఒక చిత్రం చేస్తాడని తొస్తోంది. చిరంజీవి చెప్పడం వల్ల బన్నీ తక్కువ పారితోషికంకు సాయి కొర్రపాటి నిర్మాణంలో సినిమాను చేయబోతున్నాడు. సినిమా విడుదలైన తర్వాత లాభాల్లో వాటాను బన్నీ తీసుకోబోతున్నాడు. బన్నీ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే విషయం తెల్సిందే. అందుకే నిర్మాత సాయి కొర్రపాటి కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి విజేత వల్ల నష్టపోయిన సాయి కొర్రపాటిని మెగా ఫ్యామిలీ మంచి మనస్సుతో ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. త్వరలోనే సాయి కొర్రపాటి నిర్మాణంలో బన్నీ సినిమా ఉంటుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.