రెండో సినిమా మొదలెట్టిన చిరు అల్లుడు

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ ని వివాహం చేసుకున్నప్పుడే అందరూ అనుకున్నారు కుర్రాడు బాగానే ఉన్నాడు, హీరో అవుదామనే మొదటి భర్త నుండి విడాకులు తీసుకొని, ఒక కూతురుకి తల్లైన శ్రీజ తో వివాహం చేసుకోనున్న, అందులోనూ బిజినెస్ మాన్ కొడుకంటా కూడా…అనే మాటలు చాలానే వినపడ్డాయి. అందరూ అనుకున్నట్లుగానే పెళ్ళైన ఏడాదిలోపే హీరో కి కావలసిన సరంజామా అనగా హార్స్ రైడింగ్, ఫైట్స్, డాన్స్, నటన వంటి వాటిలో శిక్షణ కూడా తీసుకొని విజేత అనే సెంటిమెంట్ టైటిల్ పెట్టుకొని మరీ మొదటి సినిమాతో వచ్చాడు.

రెండో సినిమా మొదలెట్టిన చిరు అల్లుడు - Telugu Bullet

ఈ విజేత అనే మొదటి సినిమాకి ఏమేమి చేయాలో అంతా చేశాడు మన మెగాస్టార్. వాటిలో భాగంగా బాహుబలి సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా చేసిన రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ కే.కే. సెంథిల్ కుమార్ ని సినిమాటోగ్రాఫర్ గా, సాయి కొర్రపాటి నిర్మాతగా సెట్ చేయించాడు. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ బాగుంది అని టాక్ వచ్చినప్పటికీ సినిమా ఎందుకో సరిగ్గా ఆడలేదు. కళ్యాణ్ దేవ్ నటనకి పాస్ మార్కులు కూడా వేయలేదు తెలుగు ప్రేక్షకులు. సినిమాకి పెట్టిన పెట్టుబడి లో సగం కూడా రాబట్టకుండా నిర్మాతకు నష్టాలను రుచిచూపించింది.

రెండో సినిమా మొదలెట్టిన చిరు అల్లుడు - Telugu Bullet

ఈరోజే తన రెండో సినిమా వివరాలను తన ట్విట్టర్ పేజీలో ప్రకటించాడు కళ్యాణ్ దేవ్. ఈ సినిమాకి దర్శకత్వం పులి వాసు వహిస్తుండగా, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. బుల్లితెర డైరెక్టర్ అయినా పులి వాసు ఎన్నో విజయవంతమైన సీరియళ్లను తీశాడు. అంతేకాకుండా తన మొదటి సినిమాని సుధీర్ బాబు మరియు మెహ్రీన్ పిర్జాడ లతో ఆగష్టు నుండి షూటింగ్ కూడా ప్రారంభించాడు. ఈ సినిమాని కూడా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థనే నిర్మిస్తుంది. ఈరోజు రిలీజ్ అయినా పోస్టర్ ప్రకారం, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ తన ప్రొడక్షన్-2 ని పులి వాసు దర్శకత్వంలోనే కళ్యాణ్ దేవ్ తో నిర్మిస్తుంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు.

image.png