ది లయన్ కింగ్ టీజర్ – భలే ఉంది ఈ భారీ రీమేక్

డిస్నీ సంస్థ 1994 లో తీసిన ది లయన్ కింగ్ సినిమాని సరికొత్తగా రీమేక్ చేస్తుంది. ఈ సినిమాకి దర్శకత్వం జాన్ ఫేవరే వహిస్తుండగా, వాల్ట్ డిస్నీ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ జాన్ ఫేవరే దర్శకుడు గతంలో తీసిన సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యి మంచి విజయాలు సాధించాయి. ఆ సినిమాలు ఐరన్ మాన్ -1, ఐరన్ మాన్ -2, ది జంగల్ బుక్. ఈ జంగల్ బుక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టడంతో, మళ్ళీ ఈ డైరెక్టర్ 1994 క్లాసిక్ యానిమేషన్ ఫిలిం ది లయన్ కింగ్ ని రీమేక్ చేస్తున్నాడు. జంగల్ బుక్ సినిమాకి ఉపయోగించిన ఫోటోరియలిస్టిక్ యానిమేషన్ టెక్నాలజీతోనే ఈ ది లయన్ కింగ్ సినిమాని కూడా తీస్తున్నాడు ఈ చిత్ర దర్శకుడు. ఈయన హీరోగా నటించిన చెఫ్ సినిమా కూడా ఇంగ్లీష్ లో మంచి విజయం సాధించడంతో, సైఫ్ అలీఖాన్ హిందీలో చెఫ్ అనే టైటిల్ తోనే రీమేక్ చేశాడు.

తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ని చూస్తే, ప్రారంభ సన్నివేశాలే గమ్మత్తుగా ఉండి ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా బుల్లి సింహం అయిన సింబా కి బొట్టు పెట్టి మరీ అడవిలోని అన్ని జంతువుల ముందు రాఫీకి పరిచయం చేయడం అనే సన్నివేశం చూడగానే ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్లోని నేరేషన్ అంత ది జంగల్ బుక్ లోని స్క్రీన్ ప్లే ని తలపిస్తుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఆ పాత్రలు, ఆ మ్యూజిక్, తీసిన విధానం, గ్రాఫిక్స్ అన్నీ ది జంగల్ బుక్ ని మళ్ళీ చూస్తున్నామా అనిపించేలా ఉన్నాయి. సమ్మర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉండడంతో తెలుగులో ఈ సినిమాని హీరో రానా విడుదల చేయబోవడమే కాకుండా లయన్ కింగ్ అయినా సింబా కి తెలుగు డబ్బింగ్ చెప్పబోతున్నట్లు సమాచారం.