చరణ్ తో రావడం వరుణ్ కు ఇష్టం లేదట!

సంక్రాంతి ఒక్క పెద్ద పండగ మాత్రమే కాదు సినిమా హీరోలకు దర్శకులకు అదో సినిమా విడుదలకు పెద్ద బిజినెస్ డే. ఈ సంక్రాంతికి కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి. రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న వినయ విధేయ రామ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదలవుతుంది. అలాగే బాలకృష్ణ ప్రతి సంక్రాంతి కి ఓ సినిమా ను విడుదల చేయడం అలవాటు. ఇప్పుడు అదే ఫార్ములను కంటిన్యూ చేస్తూ క్రిష్ దర్శకత్వం లో వస్తున్నా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని విడుదల చేయనున్నాడు. దాదాపు గా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సారి కూడా సంక్రాంతి మాదే అంటూ బరిలోకి దిగుతున్నాడు బాలకృష్ణ.

Varun F2 Movie And  Vinaya Vidheya Rama

 

వరుణ్ తేజ్, వెంకటేష్ ల మల్టీ స్టారర్ ఎఫ్2 కూడా సంక్రాంతి కి విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజ్ భావిస్తున్నాడు. కానీ వరుణ్ తేజ్ కి మాత్రం ఇష్టం లేదంట ఎందుకు అంటే అన్నయ్య రామ్ చరణ్ నటించిన చిత్రంతో పోటీ ఎందుకు అని అనుకుంటున్నాడు. కానీ దిల్ రాజ్ మాత్రం సంక్రాంతి రావడమే కరెక్ట్ అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వినయ విధేయ రామ పక్క మాస్ చిత్రం. ఎన్టీఆర్ బయోపిక్ అదో తరహా చిత్రం కానీ ఎఫ్2 కామెడీ ఎంటర్టైనర్ కావున ఈ చిత్రం సంక్రాంతి కి రావడమే కరెక్ట్ అని దిల్ రాజ్ భావిస్తున్నాడు. నాగబాబు కూడా ఎఫ్2 ను సంక్రాంతి కి కాకుండా జనవరి 25న విడుదల చేయాలి సూచించాడు అంట. నాగబాబు, వరుణ్ మాటలు విని దిల్ రాజ్ లాంటి బిజినెస్ మాన్ ఎఫ్2ను పోస్ట్ పోన్ చేస్తాడు అనుకోవడం డౌటే. ఒక్కవేల ఎఫ్2 భరీ లోనుండి తప్పుకుంటే మిస్టర్ మజ్ను సంక్రాంతి కి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం.