విధేయ రాముడు బిజినెస్ లో కుమ్ముడు

Exhibitors Interested In Ramcharan Movie

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన చిత్రం రంగస్థలం ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి విజయంను దక్కించుకుంది. ఈ చిత్రం ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కించాడు. ఈ చిత్రం తరువాత డివివి ప్రొడక్షన్స్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా వినయ విధేయ రామ అనే చిత్రాని రూపొందించాడు. బోయపాటి ఈ చిత్రాని ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించాడు. రంగస్థలం చిత్రం తరువాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వినయ విధేయ రామ చిత్రం హింది శాటిలైట్ రూపంలో 22 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్స్ చేసింది. నైజాం లో 20 కోట్లు బిజినెస్స్ చేస్తుందని సమాచారం అందింది. అలాగే గోదవరి జిల్లాలో 10 కోట్లు పైమాట గా బిజినెస్స్ చేస్తుంది.

Vinaya-Vidheya-Ram

పచ్చిమ గోదావరి జిల్లాలో 5.6 కోట్లు కు గీత ఫిలిమ్స్ హక్కులను చేజికించుకున్న సంగతి తెలిసిందే. రంగస్థలం చిత్రం ఒక్క పచ్చిమ గోదావరి జిలల్లోనే 4.3 కొట్ట్లుకు కొనుకుంటే 6.3 కోట్లు బిజినెస్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకు మించి బిజినెస్స్ చేస్తునదని చర్చలు సాగుతున్నాయి. రంగస్థలం గుంటూరు ఏరియాలో భారీ కలెక్షన్స్ వసూలు చేసినది కావునా వినయ విధేయ రామ చిత్రం కూడా భారీగా వసూలు చేస్తుందని పంపిణి దారులు భావిస్తున్నారంట. గుంటూరు లోని సి -డి కేంద్రాల్లో హక్కుల కోసం జయరాం అనే పంపిణి ధారుడు 1.6 కోట్లు చెల్లించి మరి దక్కించుకున్నాడు. ఓవర్ సిస్ లో పెద్ద ఎత్తున్నా వినయ విధేయ రామ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చిత్ర నిర్మాత భావిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంత్రి కానుకగా విడుదల చేస్తున్నారు.