అత్త పాత్రకు హీరోయిన్ చేంజ్

బాబీ దర్శకత్వంలో వెంకీ మామ అనే మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ లో నాగ చైతన్య పైన కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. వెంకటేష్ ఎఫ్2 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని వెంకీ మామ సెట్ లో చేరాడు. అయితే ఈ చిత్రం లో మొదటి నుండి వెంకటేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ హుమ్మ ఖురేసి నటిస్తునదని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం హుమ్మ ఖురేసి స్థానంలో శ్రియను ఎంపిక చేశారంట. హుమ్మ ఖురేసి పైన కూడా ట్రయిల్ షూట్ జరిపారు కానీ వెంకి సరసన మరి యంగ్ గా కనిపిస్తుండటం తో హుమ్మ కంటే శ్రియనే, వెంకి కి కరెక్ట్ మాచింగ్ గా ఉంటుందని ఎంపిక చేశారు.

శ్రియ వయసు పరంగా కూడా కొంచెం ఎక్కువే. ఆల్రెడీ ఇంతకు ముందు ఈ జంట ఓ రెండు చిత్రలో కలిసి నటించారు. వీరిద్దరి జంటకు మంచి మార్క్స్ పడ్డాయి. హీరోయిన్ శ్రియ కుడా తెలుగులో సీనియర్ స్టార్ హీరోస్ సరసన నటించింది. ఈ మద్య నందమూరి బాలకృష్ణ తో ఓ రెండు సినిమాలో నటించింది. ఈ జంటను ఆదరించిన ప్రేక్షకులు తప్పకుండ వెంకటేష్, శ్రియ కాంబినేషన్ కూడా అధరిస్తారని చిత్రబృంధం భావిస్తుంది. ఈ చిత్రంలో వెంకటేష్ భార్య గా నాగచైతన్య కు అత్తగ గా నటించాలి కావునా కాస్త ఎక్కువ ఏజ్ గా ఉండాలని శ్రియను ఎంపిక చేయన్నున్నారు. తరువాత జరిగే షెడ్యూల్ లో వెంకటేష్, నాగచైతన్య ల మద్య కొన్ని సిన్స్ తీయనున్నారు.