పవన్-జగన్ ల బండారాన్ని బయట పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే !

తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. గులాబీ పార్టీ ధాటికి ప్రజాకూటమి పట్టుమని 25 సీట్లు కూడా దాటలేకపోయింది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు దాదాపు అన్ద్దరూ ఓటమి పాలయ్యారు. ఇక 13 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించగా, తెలంగాణ జనసమితి, సీపీఐలు అయితే డిపాజిట్లు కోల్పోయి ఖాతా కూడా తెరవలేదు. అలాగే భారతీయ జనతా పార్టీ కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. ముఖ్యంగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ఓటర్లు షాకిచ్చారు. కంచుకోటలుగా చెప్పుకునే నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీ భారీ తేడాతో ఓటమి పాలయింది. గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాగా వేసిన టీడీపీ ఈ సారి ఒక్కటంటే ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది.
పవన్-జగన్ ల బండారాన్ని బయట పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ! - Telugu Bullet
వాటిలో ఒకటైన కూకట్‌పల్లిలో పోటీ చేసిన దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూడా ఘార పరాభవం చవి చూశారు. సెటిలర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఒకటైన ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి 43 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించిన మాధవరం కృష్ణారావు, అనంతరం మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఆయనకు మరోసారి అవకాశం కల్పించారు కేసీఆర్. అయితే, ఈ స్థానాన్ని టీడీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హోరాహోరీ పోరు ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, శుక్రవారం వెలువడిన ఫలితాల్లో మాత్రం వార్ వన్‌సైడ్ అయిపోయింది. విజయం సాధించిన తర్వాత మాట్లాడిన మాధవరం కృష్ణారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కూకట్‌పల్లిలో టీఆర్ఎస్‌కు మద్దతిచ్చినందుకు ఆయన ఈ విధంగా ధన్యవాదలు. వాస్తవానికి జగన్‌గానీ, పవన్‌గానీ ఏ పార్టీకి మద్దతిచ్చినట్లు ప్రకటించలేదు. కానీ, ఈ రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్‌ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. అయితే, ఈ విషయం ఇప్పటి వరకు అధికారికంగా అయితే బయటకు రాలేదు. ఇప్పుడు మాధవరం చేసిన వ్యాఖ్యలతో జగన్, పవన్ ల బండారం బయట పడింది. మరి దీని పై ఆ రెండు పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.